Kambhampati Hari Babu: ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా తెలుగువారైన కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణం చేశారు. గతవారంలో ఆయనను మిజోరం గవర్నర్‌గా నియమించారు. సోమవారం ఆయన ఐజ్వాల్‌లో గవర్నర్‌గా ప్రమాణం చేశారు.
ఇటీవల గవర్నర్ల బదిలీల నియామకాలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. సోమవారం ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణం అనంతరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర పరిధిలోని లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు.


హరిబాబు మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం జోరామ్‌తంగా, టాన్లూయా, ఉప ముఖ్యమంత్రి స్పీకర్, లాలిన్లియానా ఫైలో, మంత్రుల మండలి ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు పలు పార్టీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ కేంత్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇటీవలనే ఆయన హర్యానా గవర్నర్‌గా బాధ్యలు స్వీకరించిన విషయం తెలిసిందే.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!