Crime news today: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాతిక లక్షల రూపాయలు ఎత్తుకెళ్లి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి పోగు చేసుకుని దాచిన డబ్బు దొంగల పాలైంది. ఆరోగ్యం బాగలేక పోవడంతో డబ్బులు ఇంట్లో ఉంచి ఆస్పతికి వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులకు ఇంటికి తిరిగి వచ్చేలోపు ఇళ్లు గుళ్లయ్యింది. ఇంట్లో దాచిన రూ.25 లక్షలతో పాటు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టనంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నగువోతు నర్సింహులు తన ఇంట్లోనే కిరాణా దుకాణం నడిపిస్తూ వ్యాపరం చేసుకుంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగలేకపోవడంతో మూడు రోజులుగా నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్సల కోసం ఇంట్లో పాతిక లక్షలు పొగు చేసి పెట్టకున్నారు. నగదుతో పాటు 5 తులాల బంగారం కూడా ఇంట్లోనే ఉంచి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో డబ్బు, బంగారం చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
Crime news today: ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్క్వార్డ్ ను రప్పించి తనిఖీలు చేపట్టారు. చోరీ జరిగిన ఇంట్లో రక్తపు మరకలు కూడా ఉన్నాయి. పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. రూరల్ సీఐ, పట్టణ సీఐ, సీసీఎస్ ఆధ్వర్యం లో మూడు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసును చేదిస్తామని చెప్పారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇంట్లో పెద్ద మొత్తం లో నగదు, బంగారం పెట్టి వెళ్లవద్దని సూచించారు.
కాజీపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్


వరంగల్: కాజీపే పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీసు కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసు స్టేషన్ లోని పెండింగ్ కేసులను తనిఖీ చేసి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసులను ఆదేశిం చారు. కాజీపేట లోని రౌడీషీటర్ల ప్రవర్తనపై పోలీసులను అడిగారు. కాజీపేట సీఐ బదిలీపై వెళ్తున్న సమయంలో పోలీసు కమిషనర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. పోలీసు స్టేషన్ తనిఖీలో పోలీసు కమిషనర్ తో పాటు డీఎస్పీ పుష్ఫ, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!