Kalyana Laxmi Eligible Love Marriage | కల్యాణ లక్ష్మి పథకం ను తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఎంతో మంది నిరుపేద యువతులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం ద్వారా పెళ్లి అయిన జంటకు(ఆడపిల్లకు) రూ.1 లక్ష ఆర్థిక సహాయం అంద జేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటికే ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిపొందారు. ప్రతి ఏడా బడ్జెట్లో ఈ పథకం కోసం కొన్ని నిధులను కేటాయిస్తున్నారు. కల్యాణ లక్ష్మి పథకం తెలంగాణలో పుట్టిన అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది.
లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు
అయితే ఈ పథకం(Kalyana Laxmi)కు సంబంధించి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఒక శుభవార్త చెప్పారు. ఇక నుంచి లవ్ మ్యారేజీ(Love Marriage) చేసుకున్నవారికి కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింస్తుందని, వారు కూడా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏకంగా మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడంతో వాస్తవ రూపం దాల్చనుంది. ఇప్పటి వరకు పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్లు చేసుకున్న జంటలకు మాత్రమే కల్యాణ లక్ష్మి పథకం వర్తించింది. ఇప్పుడు లవ్ మర్యేజీ చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుం దన్న వార్త బయటకు రావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న లవర్స్ ఇక మనకు తిరుగులేదో అన్నట్టు సంతోష పడుతున్నారట.
మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించిన ఈ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లవ్ మర్యేజీ చేసుకున్న, చేసుకుంటున్న వారికి స్వీట్స్ పంచినట్టు ఉంది. ఈ ప్రకటనలో సోషల్ మీడియాలో నెటిజన్లు కొత్తకొత్త డౌట్లను అడగడంతో పాటు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నకు ధన్యవాదాలు అని చెబుతున్నారు. 20 ఏళ్లకు ఎంత మెచ్యురుటీ వస్తుందని 23 సంవత్సరాలు అమ్మాయికి, 25 సంవత్సరాలు అబ్బాయికి వయస్సు అర్హత పెట్టి లవ్ మ్యారేజీ చేసుకున్నవారికి వర్తించేలా నిబంధనల పెట్టండని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎటూగాని వయస్సులో ప్రేమ పెళ్లి చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటారని, వాళ్లని లవ్ మ్యారేజీలకు ప్రోత్సహించొద్దని చెబుతున్నారు కొందరు.

funny comments: కామెంట్స్ మామూలుగా లేవుగా!
1.అమ్మయి: లవ్ మ్యారేజీ చేసుకుంటే ఎట్లా బతుకుదాం?
అబ్బాయి: కల్యాణ లక్ష్మి అత్తది కదా ఒడిసేదాకా తిరుగుదాం. తర్వాత చూద్ధాం!
2.లవర్ లేదు దయ తలచి అది కూడా సప్లై చేస్తే చాలు గొప్పవారు అవుతారు.
3.మ్యారేజీ ఇంట్లో చెప్పకుండా చేసుకుంటే..లవర్‌కు ఇస్తారా చెక్. చేసుకున్న ఆయకు ఇస్తారా?. లవర్ వాళ్ల తల్లిదండ్రులకు ఇస్తారా? క్లియర్‌గా చెప్పండి సార్!
4.అయ్యా మా ఆంధ్రప్రదేశ్‌లో కల్యాణ లక్ష్మి లేదయ్యా, దయచేసి వచ్చేలా చూడండి అయ్యా!
5.మరి విడాకులు అప్పుడు ఏం ఇస్తారు? ఆన్సర్: ఇచ్చిన చెక్ రిటర్న్ ఇస్తేనే డివోర్స్ సర్టిఫికెట్ ఇస్తారు.
6.ఎందుకు ఇవి పేరెంట్స్‌ను ఎదురించడానికా?
7.ఎన్ని లవ్ మ్యారేజ్ లు చేసుకున్నా ఇస్తారా?
8.నేను అప్లై చేసి వన్ ఇయర్ అవుతుంది. ఇంకా రాలే నీ కల్యాణ లక్ష్మి.
9.అమ్మయ్య ! ఇన్ని రోజులు మనీ కోసం ఆగిన. ఇప్పుడు నో ప్రాబ్లెమ్!
10.కొంచెం ఎక్కువే ఇవ్వండి సార్! పాపం అమ్మానాన్న, అన్నాదమ్ములను ఎదురించి, బాధపెట్టి మరీ చేసుకోవాలి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!