Kalavathi song | సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాట ఇప్పుడు యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న రిలీజైన ఈ పాట ఇప్పటికే 100 మిలియన్ల (10 కోట్ల) Views సొంతం చేసుకుంది. తెలుగు సిని ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ వచ్చిన తొలి సింగిల్ సాంగ్ ఇదేనని చిత్ర బృందం ప్రకటించింది. పాటలోని లిరిక్స్, తమన్ మ్యూజిక్ నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. ఈ పాట(Kalavathi song)కు 17 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు చెప్పింది అలా ఉంటే తాజాగా ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి మళ్లీ రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ Sriram పాడాడు. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మే 12న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
sarkaru vaari paata సినిమా విశేషాలు
మహేష్ బాబు అభిమానులకు Good News. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట Trailer విడుదల తేదీ ఖరారైంది. సినిమా హైప్‌ను పెంచే విధంగా రూపుదిద్దుకున్న ట్రైలర్‌ను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 28న ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ అంతా ఫుల్ యాక్షన్‌తో కూడుకుని ఉన్నట్టు సమాచారం. సినిమా ఇప్పటికే మ్యూజికల్ Hit Talk తెచ్చుకోవడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
పాట ప్రమోషన్లో భాగంగా సూపర్‌స్టార్ Mahesh babu సర్కారు వారి పాట మూవీలోని కళావతి పాటకు మ్యూజిక్ డైరెక్టర్ s.s thaman తనదైన స్టైల్లో స్టెప్స్ వేశాడు. ఈ పాటలో మహేష్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి చేశాడు. ఈ వీడియోను థమన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది Viral అవుతుంది. నీ మల్టీటాలెంట్కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
క్లాసురూంలోకి పాకిన కళావతి!
మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలోని కళావతి పాట టీచర్లకూ పాకింది. ఓ Class Roomలో ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గురించి వివరిస్తున్న లెక్చరర్, కళావతి పాటను ఊదాహరణగా తీసుకున్నారు. మంచి ఉద్యోగాలు వస్తే జీతాలు.. ఒక వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో…అంటూ వివరించారు. కళావతి అని కాదు సరస్వతి..సరస్వతి అని పాడుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.