Kalabandha: ఎండాకాలంలో అలా బయటకు వెళితే చాలు చర్మం అలసిపోయి రంగు మారుతుంది. అలాగని పట్టించుకోకపోతే సమస్య మరీ పెరిగిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే కలబందతో ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. రెండు చెంచాల కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖం, మెడకి పూతలా వేయాలి. ఓ పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే ఎండ వల్ల ఏర్పడే టాన్ ఇట్టే తొలిగిపోతుంది. ఎండలో తిరిగినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు ఈ పూతను వేసుకుంటే చర్మానికి సాంత్వన కలుగుతుంది. ఇతరత్రా సమస్యలు దూరం.

చర్మ సంబంధిత సమస్యలకు కలబంద(Kalabandha)
చాలా మందిని వేధించే చర్మ(skin) సంబంధిత సమస్యల్లో పిగ్మెంటేషన్ ఒకటి. దీన్ని దూరం చేయాలంటే, చెంచా కలబంద గుజ్జులో కొన్ని చుక్కల గులాబీ నీళ్లు వేసి చర్మానికి క్రీమ్ రాసినట్టు రాయాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే పిగ్మెంటేషన్ దూరమవుతుంది. చర్మానికి చల్లదనం కూడా అందుతుంది. జిడ్డు

జిడ్డు చర్మం వాళ్లకి కలబంద
జిడ్డు చర్మంతో బాధపడేవారు కలబంద(Kalabandha) గుజ్జులో తేనె చేర్చి ముఖం, మెడకి మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఎండ, వేడి కారణంగా ఏర్పడే జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. తేనె చర్మానికి మాయిశ్చరైజర్ గుణాలను అందిస్తుంది. ఎండప్రభావం కూడా చర్మం మీద పడదు.
చర్మం సున్నితంగా ఉండాలంటే!
కొందరికి చర్మం సున్నితంగా ఉండి ఎండలోకి వెళ్లగానే కందిపోతుంది. అలాంటి వారు కలబంద గుజ్జు, కీరదోస రసం సమపాళ్లలో తీసుకుని కొద్దిగా గులాబీ నూనె, పెరుగు చేర్చాలి. ఈ పూతని ముఖానికి రాసుకుని గాలికి ఆరనివ్వాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుని మృదువుగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కందిన చర్మం మామూలుగా అవుతుంది. చర్మం మీద దద్దర్లూ, మలినాలు, మురికి తొలిగిపోతాయి.

మృతచర్మం ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం కళతప్పుతుంది. అందుకేం చేయాలంటే కలబంద, కీరదోస గుజ్జును సమపాళ్లతో తీసుకుని చర్మానికి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పంచదార, తేనె తీసుకుని మళ్లీ మృదువుగా స్క్రబ్ చేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే మృతకణాలు తొలగిపోయి చర్మం కళగా మెరిసిపోతుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!