SI Gopala Krishna | ఇటీవల పోలీసులు Suicideకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఉద్యోగ రిత్యా ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు క్షణం కూడా తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. అర్థాంతరంగా ఫోన్ వస్తే అర్థ రాత్రి అయినా వెళ్లాల్సిందే. పోలీసులకు గౌరవం ఎంత ఉన్నదో అంతకన్నా మానసిక ఒత్తుళ్లు, ఇబ్బందులు కూడా అదే విధంగా ఉన్నాయి. విధి నిర్వహణలో ఉన్న ఎంతో మంది కానిస్టేబుళ్లు GUN తో కాల్చుకోవడం, ఇతరులపై కాల్పులు జర పడం లాంటివి దేశంలో అక్కడక్కడా వార్తలు చూసే ఉంటాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా సర్పవరం SI Gopala Krishna ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కాకినాడ జిల్లా Sarpavaram పోలీసు స్టేషన్ SI ఐ గోపాల్ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం SI మృతదేహాన్ని కాకినాడ GGHకు తరలించారు.

kakinada రూరల్ సర్పవరం POLICE స్టేషన్లో ఎస్సైగా ముత్తవరపు Gopalaకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సైది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట. గతంలో పెనుగంచిప్రోలు తాశీల్దార్ కార్యాలయంలో VROగా విధులు నిర్వహించారు. 2014 సంవత్సరంలో ఎస్సైగా సెలక్ట్ అయ్యారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు కలదు. గోపాల కృష్ణ అత్యంత సౌమ్యుడిగా తన స్వగ్రామంలో మంచి పేరుంది. ఎస్సై మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. Nawabpet గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.