kakinada gottam kaja కాకినాడ కాజాకు అరుదైన గౌరవం దక్కింది. గొట్టం కాజాకు పోస్టల్ శాఖ గుర్తింపు ఇచ్చింది. ఏపీలో వందేళ్ల 100 ఏళ్ల చరిత్ర ఉండి అత్యంత ఆదరణ కలిగిన స్వీట్స్‌కు ప్రత్యేక స్టాంపును భారతీయ తపాలాశాఖా విడుదల చేసింది.
గొట్టం కాజా(kakinada gottam kaja)కు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆదరణ కలిగిన స్వీట్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన కాకినాడ గొట్టం కాజా ఒక్కసారి తింటే మరలా మరలా తినాలనిపించేంతలా రుచిగా ఉంటుంది. కాకినాడా కాజాకు అరుదైన గుర్తింపు రావడంతో గోదావరి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కాజాగా ఖ్యాతిగాంచిన ఈ కాజా(kotaiah kaja) ను కోటయ్య అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా 1891లో తయారు చేశారు. ఈ కాజాకు ఉండే ప్రత్యేక రుచి వలన కాకినాడ కోటయ్య కాజాగా కీర్తి పొందారు. కాకినాడకు లేదా చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వెళ్లిన విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్లు కాకినాడకు వస్తే తప్పకుండా కాజాను కొనుగోలు చేస్తారు.
కాజాకు అంతర్జాతీయ ప్రచారం
అయితే 2018 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాతీయంగా మరింత ప్రచారం కల్పించింది. ఇప్పుడు భారత తపాలా శాఖ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ఈ కాజాతో పోస్టల్ స్టాంప్ ద్వారా మరింత వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రుల గౌరవం మునుపటితో పోలిస్తే మరింతగా పెరిగిందంటున్నారు ఉభయగోదావరి జిల్లా ప్రజలు.
మాడుగుల హల్వా(madugula halwa)కూ గుర్తింపు
కాకినాడ గొట్టం కాజాతో పాటు విశాఖజిల్లాకు చెందిన మాడుగుల హల్వా(madugula halwa)కు విశిష్టస్థానం కల్పించింది భారతీయ పోస్టల్ శాఖ. మాడుగుల వేదికగా దంగేటి ధర్మారావు 1890లో తొలిసారి ఈ హల్వాను తయారు చేశారు. ఈ హల్వాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, బాధం పప్పు, జీడిపప్పు వంటి పదార్థాలతో రుచికరమైన హల్వాను తయారు చేస్తారు. ఈ హల్వాకు లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్టు అంతర్జాతీయంగా ప్రచారంలో ఉంది. మాడుగుల నుంచి ఈ స్వీట్ 20కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పుడు పోస్టల్ శాఖ మాడుగుల హల్వాతో ఉన్న ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. దీంతో మాడుగుల హల్వా తయారీదారులతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!