Kajal Aggarwal body shaming

Kajal Aggarwal body shaming: నేనూ మ‌హిళ‌నే అంటూ నెటిజ‌న్ల‌కు ఆవేద‌న‌గా బదులిచ్చిన కాజ‌ల్

movie news

Kajal Aggarwal body shaming: టాలీవుడ్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల‌పై కొంద‌రు నెటిజ‌న్లు బాడీ షేమింగ్‌పై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని తాను ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. పెళ్లి అయిన త‌ర్వాత త‌న జీవితంలో, ఇంట్లో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో అయితే కొంద‌రు వ్య‌క్తులు బాడీ షేమింగ్‌పై కామెంట్లు చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌లో ఎన్నో మార్పులు వ‌స్తాయ‌ని కాజోల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal)అన్నారు. బరువు పెర‌గ‌డంతో పాటు హార్మోన్ల‌లో మార్పులు వ‌స్తాయ‌ని (body shaming)తెలిపారు.

క‌డుపులో ఉన్న బేబీ పెరిగే కొద్ది ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయ‌న్నారు. అంతే కాకుండా చ‌ర్మం కూడా మారిపోతుంద‌ని, డెలివరీ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో తీవ్ర అల‌స‌ట వ‌స్తుంద‌ని అన్నారు. నెగిటివ్ ఆలోచ‌న్లు వ‌స్తాయ‌ని, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు ఆలోచ‌న్లు వ‌స్తాయ‌ని తెలిపారు. డెలివ‌రీ అయిన త‌ర్వాత సాధార‌ణ స్థితికి రావడానికి చాలా క‌ష్ట ప‌డాల్సి వ‌స్తుంద‌ని కాజ‌ల్ అన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న‌ట్టు కుద‌ర‌ద‌ని తెలిపారు. ఇవ‌న్నీ ప్ర‌తి మ‌హిళ జీవితంలో సాధార‌ణంగా జ‌రిగే విష‌యాలేన‌ని అన్నారు. పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఆ మధుర స్మ‌తుల‌ను చూడాల‌ని ఏ మ‌హిళా అయినా కోరుకుంటుంద‌ని తెలిపారు. స్త్రీల జీవితంలో జ‌రిగే ప‌రిణామాల‌పై వ‌చ్చిన బాడీ షేమింగ్‌పై మీమ్స్ చేయ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కాజోల్ అగ‌ర్వాల్‌.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *