Kabul Blast | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రమూక రెచ్చిపోయింది. రెండు పాఠశాలలపై ఆత్మహుతి దాడికి పాల్పడగా పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించినట్టు తెలుస్తోంది. ముందుగా ముంతాజ్ స్కూల్లో దాడి(Kabul Blast) జరిగింది. వెంటనే సరిహద్దుల్లోని దష్తీ బార్చిలోని ఉన్న అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాల బయట రెండు ఐఈడీలలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీసు అధికారి చెప్పారు. ఈ పేలుళ్లలో 10 మందికి పైగా విద్యార్థులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. రెండు దాడి ఘటనల్లో మృతులు సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కాగా ఈ దాడి ఐఎస్ ఉగ్రవాదుల పనిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అధికార ప్రకన వెలువడలేదు. గతేడాది మే నెలలో ఇదే ప్రాంతంలో ఓ స్కూలులో జరిగిన పేలుళ్లలో 85 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ వరుస పేలుళ్లకు ఆత్మహుతి దాడే కారణంగా అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం తొలుత పశ్చిమ కాబుల్ లోని ముంతాజ్ స్కూల్ లో తొలి పేలుడు అబ్దుల్ రహీం షాహిద్ స్కూల్లో చోటు చేసుకుంది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకరాం స్కూళ్ల వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో కనీసం 25 మంది విద్యార్థులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ భద్రతా ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఉగ్రవాదులు రెండు ఐఈడీలతో పేలుళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. తాజా ఘటనతో కాబూల్ ఉలిక్కిపడింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!