Justice Ahsanuddin Amanullah | మహిళల భద్రతకు Police విభాగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని AP legal services authority ఛైర్మన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. SOS కాల్‌కు వెంటనే స్పందించి బాధితురాలిని ఆదుకున్న పోలీసులకు లీగల్ సర్వీసెస్ తరపున రివార్డులు అందజేస్తామన్నారు. శనివారం శ్రీ Padmavati మహిళి విశ్వవిద్యాలయంలో మహిళా భద్రతపై లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయశాఖ పోలీసులు, రెవెన్యూ మరియు ఎన్జీవోలతో సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా ఆడిటోరియం ప్రాంగంణంలో Tirupati జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన, లాక్డ్ హౌస్ monitoring system స్టాల్ ను ప్రారంభించారు.


వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం disha పోలీసు వాహనాలను పరిశీలించి దిశా వాహనాల ద్వారా మహిళా పోలీసులు మహిళలకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే భద్రత కల్పించేందుకు ఎంతగానో దోహదపడు తుందని తెలిపి దిశా మహిలా పోలీసులను అభినందించారు. మహిళల, బాలికలు భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, దీనిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని Justice Ahsanuddin Amanullah పేర్కొన్నారు.
పోలీసుల సేవలు అభినందనీయం!
దిశాయాప్ ద్వారా కూడా మహిళలకు ఎంతో భద్రత ఉంటుందన్నారు. అదే విధంగా raas స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఛైల్డ్ help line, స్టాల్‌ను పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన కుటుంబ సలహా కేంద్రం stallను ప్రారంభించారు. వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి chittoor జిల్లాలలో ఇప్పటి వరకు న్యాయబద్ధంగా పరిష్కరించబడ్డ సమస్యలు, భద్రత అంశాలపై చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


చిత్తూరు SP రిశాంత్ రెడ్డి IPS మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సమన్వయం చేసుకుంటూ కేసులను త్వరితగతిన పూర్తి చేయడమే కాక, మహిళల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. తిరుపతి జిల్లా SP మాట్లాడుతూ ఆపరేషన్ ముష్కన్ ద్వారా వందల సంఖ్యలలో వీధి బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందనీ పేర్కొన్నారు. న్యాయమూర్తి Ahsanuddin Amanullah మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంలో పనిచేస్తూ మహిళల భద్రతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్
అడిషనల్ ఎస్పీ సుప్రజా, దిశా డీస్పీ రామరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.