ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Ap high court న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ హ‌సానుద్దీన్ అమానుల్లా ప్ర‌మాణ స్వీకారం

Ap high court అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ హ‌సానుద్దీన్ అమానుల్లా చే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్ర‌మాణం చేయించారు. ఈ మేర‌కు ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త న్యాయ‌స్థానంలోని మొద‌టి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్ర‌దేశ్ హైకోర్టుకు న్యాయ‌మూర్తిగా బ‌దిలీపై వ‌చ్చిన జ‌స్టిస్ హ‌సానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్ర‌మాణం చేయించారు.(Ap high court)అత్యంత నిరాడంబ‌రంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి తోపాటు ఇత‌ర న్యాయ‌మూర్తులు, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ఎస్‌.శ్రీ‌రాం, ఏపీ హైకోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు కె.జాన‌కీరామి రెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షులు గంటా రామారావు, ప‌లువురు రిజిస్ట్రార్‌లు, న్యాయ‌వాదులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

See also  ap news today: ఎలాంటి భ‌యాలు పెట్టుకోవ‌ద్దు..అలాంటి ఎగ్జామ్స్ స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఉండ‌వ‌ట‌!

Comment here