Junior Assistant : తండ్రికి బదులుగా కొడుకు ఉద్యోగం అడ్డంగా బుక్కయ్యాడు!
Junior Assistant : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజవర్గం పరిధిలోని గల ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని మండల ప్రజలు వాపోతున్నారు. శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బాలాజీ విధులను ఆయన కొడుకు నిర్వహిస్తూ మీడియాకు అడ్డంగా దొరికాడు.
శనివారం అనుకోకుండా కార్యాలయానికి మీడియా మిత్రులు వెళ్లారు. ఈ సమయంలో జూనియర్ అసిస్టెంట్ కుమారుడు రికార్డుల గదిలో రికార్డులను అటూ ఇటూ మారుస్తూ కంట పడ్డాడు. తక్షణమే అతడు విధులు నిర్వహిస్తున్న తీరును మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా మీడియా పట్ల దురుసుగా వ్యవహరించాడు.
తండ్రికి బదులుగా కొడుకు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో మండల ప్రజలు రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను మార్చే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో కృష్ణయ్య జూనియర్ అసిస్టెంట్ ను తన ఛాంబర్ కు పిలిచి ఘాటుగా మందలించినట్టు తెలిసింది.
నీకు బదులుగా నీ కుమారుడు రికార్డులున్న కార్యాలయంలో ఏం చేస్తున్నాడని మందలిస్తూ మరోసారి ఇలాంటిది జరిగితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో హెచ్చరించినట్టు తెలిసింది. ఏదేమై నప్పటికీ తండ్రికి బదులుగా కొడుకు రికార్డుల గదిలో ఉండటం పలువురికి అనుమానాలను తెర లేపుతుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court