julakanti ranga reddy

julakanti ranga reddy: కేతినేని చెరువుకు గోడ‌క‌ట్టండి: జూల‌కంటి

Telangana

julakanti ranga reddy సూర్యాపేట : అకాల వర్షాల మూలంగా వరి పంట తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ,తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెం పరిసర ప్రాంతాలలో అకాల వర్షాల మూలంగా వరి పంట నష్టపోయిన ప్రాంతాలను (julakanti ranga reddy)ఆయన పరిశీలించారు.

కేతినేని చెరువుకు గోడ‌క‌ట్టండి!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట- ఖమ్మం 6 వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన గల కేతినేని చెరువు వాగు ను ఆక్రమించి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వాగులో నీళ్ళు పట్టక పొంగిపొర్లి పక్కన ఉన్న 50 ఎకరాల వరి పంట పూర్తిగా కొట్టుకుపోయిందన్నారు. దానితోపాటు వ్యవసాయ పంట పొలాల్లో కి భారీగా ఇసుక చేరడంతో దాన్ని తొలగించేందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఖర్చు అవుతుందన్నారు. ఒకపక్క పెట్టుబడి పెట్టి వేసిన వరి పంట దెబ్బతినగా, మరోపక్క ఇసుక మేటలు వల్ల రైతులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కే తినే ని చెరువు వాగు కు అడ్డుగా బలమైన గోడని నిర్మించడం మూలంగానే భవిష్యత్తులో వరదలు వల్ల రైతాంగానికి ఎలాంటి నష్టం వాటిల్లదని అందుకోసం ప్రభుత్వం రోడ్డు గుత్తేదారుల‌తో మాట్లాడి బలమైన గోడను నిర్మించి రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

వంద‌లాది ఎక‌రాల వ‌రి పంట న‌ష్టం!

రాయిని గూడెం లో ని సెవెన్ ఆర్ హోటల్ ఎదురుగా వేసిన వెంచర్లు సక్రమంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు, నాలా నిర్మాణం, సైడ్ కాలువలు, పైప్ లైన్లు సక్రమంగా వేయకపోవడం మూలంగా వెంచర్ చుట్టుపక్కల నిర్మించిన గోడలు కూలి పక్కన ఉన్న వందలాది ఎకరాల వరి పంట తీవ్రంగా నష్టం అయిందన్నారు. మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాల నిర్మాణం సక్రమంగా లేని వెంచర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ,అధికారులు పరిశీలించి జరిగిన నష్టంపై అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి వరి పంట నష్టంపై వెంటనే అధికారులతో సమావేశం నిర్వహించి ,నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేనియెడల నష్టపోయిన రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జిల్లా పల్లి నరసింహారావు ,సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి ఎల్గురి గోవింద్, త్రీ టౌన్ కార్యదర్శి మేఘన బోయిన శేఖర్ ,రైతు సంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత ,మే క న పోయిన సైదమ్మ ,మందడి రామ్ రెడ్డి ,నంద్యాల కేశవ రెడ్డి ,గుర్రం వెంక రెడ్డి, నారాయణ వీరారెడ్డి ,గడిపల్లి సత్తిరెడ్డి ,మామిడి సుందరయ్య కామల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *