Judicial Separation | ప్ర. నాకు పెళ్లై 25 సంవత్సరాలు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. వారు కూడా పెళ్లీడుకు వచ్చారు. అయితే నా భర్తతోటి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను. పైనాన్షియల్గా ఎటువంటి సపోర్టు నాకు లేదు. పిల్లల్ని స్కూలు, కాలేజీల ఫీజులు చూసుకుంటున్నారు తప్ప అతని వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రమే చూసుకుంటున్నారు. ఇతనితో కలిసి ఉండటం నాకు చాలా నరకంగా ఉంది. విడాకులు ఇవ్వడం వల్ల సొసైటీలో నా మీద ఉన్న మంచితనం పోతుంది కాబట్టి, లీగల్గా నేను ఇతనికి దూరంగా ఉండాలంటే ఏం చేస్తే బెటర్?
Judicial Separation
జ. ప్రస్తుతం ఉన్న పెళ్లి జీవితాలన్నీ కోర్టు ఆవరణం వద్దనే విడాకులతో శుభం పడుతున్న విషయాలను చూస్తున్నాం. ఒక్కప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా భార్య భర్తలు కలిసి ఉండటానికే చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆలోచించడం, లైఫ్లో ఏదో పొందాలని ఆశించడం వల్ల కుటుంబాలను నాశనం చేయడం చేస్తున్నారు.ఈ ఎఫెక్ట్ ఇంట్లో ఉంటున్న వ్యక్తులపైన, భార్యలపైన ప్రభావం చూపుతుంది.
ఒక వేళ భార్యలు అలా చేస్తే భర్తలు మీద, అంతకన్నా పిల్లలు మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం 5 సంవత్సరాల లోపు, 3 మూడు సంవత్సరాల లోపు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అయితే పైన తెలిపిన సమస్య కారణంగా విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. జ్యూడిషియల్ సపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. హిందూ మార్యేజీ(Hindu Marriage Act 1955) ప్రకారం సెక్షన్ 10 కింద జ్యూడిషియల్ ఫిటిషన్ ఫైల్ చేసుకుంటే, ఎవరైతే భార్య భర్తలు విడిపోవాలనుకుంటున్నారో వారికి విడివిడిగా ఉండేందుకు కోర్టు అనుమతి ఇస్తుంది.
అయితే హక్కులు గానీ, బాధ్యతలు గానీ అలానే ఉండిపోతాయి. ఈ సెక్షన్ 10 చట్టం ప్రకారంగా భర్త ఆస్తి హక్కులపైన సర్వ హక్కులు ఉంటాయి. అతనికి సంబంధిన ప్రాపర్టీలోనే భార్య తన పిల్లలతో జీవించవచ్చు. పిల్లలు చదువులు, బాధ్యతలన్నీ భర్తే భరించాల్సి ఉంటుంది. అయితే అతను మాత్రం వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి కుదరదు. కాబట్టి మీపై ఎలాంటి దాడి చేయకుండా, హింసించ కుండా పిల్లలు భవిష్యత్తు, బాధ్యత చూసుకోవడానికి మాత్రమే అతనికి అనుమతి ఉంటుంది.

ఇది తెలియక చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ పద్ధతి గురించి చాలా మందికి తెలియదు. ఒక సారి విడాకులు అయిన తర్వాత వాళ్లు కలిసి ఉండటం అనేది జరగదు. జ్యూడిషియల్ సపరేషన్ వల్ల ఉపయోగం ఏమిటంటే విడాకులు తీసుకునే అవసరం ఉండదు. భార్య, భర్త విడిగా ఉంటున్న సమయంలో తమ తప్పులు తెలుసుకొని మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇద్దరూ కలిసి మళ్లీ జీవించే అవకాశం కూడా ఉంటుంది. కావున భార్య భర్తలు మధ్య వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఇక నేను భరించలేను, నా వల్ల కాదు అని భర్త కానీ, భార్య కానీ అనుకున్న సమయంలో ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు.
(నోట్: పైన తెలిపిన విషయాలను ప్రముఖ అడ్వకేట్ రమ్య , న్యాయ వేదిక నుండి సేకరించినవి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే.)
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!