- పుష్ఫరాజ్ ఇకలేరు!
JR Pushparaj : మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ పుడ్ కమిషన్ మాజీ ఛైర్మన్, సీనియర్ TDP నాయకులు జె.ఆర్.పుష్ఫరాజ్ గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. దళిత నేత అయిన పుష్పరాజ్ టిడిపి ప్రభుత్వం హాయంలో మంత్రిగా కూడా పనిచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టిడిపి పార్టీలోనే సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు.
టిడిపి సీనియర్ నాయకుడు JR Pushparaj మృతి పట్ల పార్టలో విషాదం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. అదే విధంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంతాపం వ్యక్తం చేశారు. పుష్ఫరాజ్ నాలుగు దశాబ్ధాలుగా నిబద్ధతతో ప్రజా సేవ చేశారని కొనిడాయారు. ఆయన మరణం TDP పార్టీకి తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.