Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మిస్తాం

Andhra Pradesh

Thopudurthi Prakash Reddy | జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటానని తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కొడిమి జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. శ‌నివారం ఉదయం ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో జర్నలిస్టులు కలిసి వివిధ సమస్యలపై (Thopudurthi Prakash Reddy)మాట్లాడారు.

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో రెండో విడత జర్నలిస్టులతో పాటు మీడియా ఎంప్లాయిస్ లో పనిచేస్తున్న ఇతర వర్గాల వారికి కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి అని, వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొడిమి జర్నలిస్ట్ కాలనీ మచ్చా రామలింగారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేశామని అన్నారు.

రాబోయే రోజుల్లో కాలనీ మొత్తం కాంపౌండ్ నిర్మిస్తామని, ఇంకా ఎంత నిధులు అయినా జర్నలిస్ట్ కాలనీకి ఖర్చు చేస్తామని, రాష్ట్రానికే రోల్ మోడల్ గా ఉండేలాగా కొడిమి జర్నలిస్ట్ కాలనీను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అంతకుముందు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మీడియాలో పనిచేస్తున్నటువంటి ఇతర వర్గాలకు కూడా గతంలోనే సొసైటీ స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు. మీడియా ఎంప్లాయిస్ లో పనిచేస్తున్న ఇతర వర్గాలకు కూడా కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి కూడా ఇల్లు నిర్మించి ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి స‌న్మానం చేస్తున్న‌జ‌ర్న‌లిస్టులు

అనంత‌రం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ని ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి విజయరాజు సాక్షి సతీష్, రాము, రంగనాథ్, కొండప్ప, మురళి, మల్లికార్జున, ప్రకాష్, జ్యోతి హరి బాలకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జానీ, బాలు, హనుమంత్ రెడ్డి, శ్రవణ్, చలపతి, శ్రీనివాస రావు, ఆది నారాయణ, కృష్ణమూర్తి, ఆది, శ్రీకాంత్, రామంజి, పెద్ద ఎత్తున ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *