Josh Talks

Josh Talks: ప‌దియేడేళ్ల కుర్రాడి మోటివేష‌న‌ల్ స్టోరీ!

success stories

Josh Talks: అప్పుడు అత‌ని వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు. కానీ 10 ల‌క్ష‌ల అప్పు. ఆరు నెల‌ల స‌మ‌యం. వ్యాపారం రంగంలో లాభ న‌ష్టాల‌ను 17 సంవ‌త్స‌రాల‌కే చ‌వి చూసిన ఆ కుర్రాడు ఆ అప్పును ఎలా తీర్చాడు? అస‌లు తాను ఎంచుకున్న మార్గం ఏమిటి? ఇప్పుడు ఆ కుర్రాడు అంద‌రికీ ఆద‌ర్శ‌వంతంగా ఎలా ఎదిగాడు?. చ‌ద‌వండి పూర్తి Motivational Josh Talks Story.

Josh Talks: 10 ల‌క్ష‌ల అప్పు – ఆరు నెల‌ల స‌మ‌యం!

అవినాష్ వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు స్వ‌స్థ‌లం. ప‌దియేడు ఏళ్ల వ‌య‌సులో సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ కాలేజీ వెళుతుంటారు. స్నేహితుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. సినిమాలు చూస్తారు. షికార్లు చేస్తారు. కానీ అవినాష్ ఆ వ‌య‌సులో ఒక వ్యాపారం పెట్టి రూ.10 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు.

అప్పుడు అవినాష్‌కు మిగిలింది రూ.10 ల‌క్ష‌ల అప్పు. అస‌లు ఇంత డ‌బ్బు ఎలా పోగొట్టుకున్నాడు. త‌ర్వాత ఎలా సెట్ అయ్యాడ‌నేది అత‌ను Josh Talks ద్వారా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. క‌థ వెన‌క్కి వెళితే, అవినాష్ వ్యాపారం చేయ‌క ముందు త‌న బ్యాంక్‌లో ఒక ల‌క్ష రూపాయ‌లు ఉన్నాయి. ఆ ల‌క్ష కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ముఖ్యంగా ఇ కామ‌ర్స్ బిజినెస్ చేస్తూ సంపాదించాడు.

అవినాష్ కుటుంబాన్ని ప‌రిశీలిస్తే వారి పెద్ద వాళ్లంతా వ్యాపారాలు చేస్తూ స్థిర ప‌డిన వారే. అలా 1 ల‌క్ష రూపాయ‌ల‌తో E Commerce పెద్ద వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఈ Business లో చైనాలో ప్రొడ‌క్ట్స్‌ కొని అమెరికాలో అమ్మేవాడు. ఈ బిజినెస్ ఎలా చేశాడంటే, త‌న పేరుతో China లో ప్రొడ‌క్ట్ కొని ఆర్డ‌ర్ ఇచ్చిన వారికి వాళ్లే అక్క‌డ నుండే పంపేవారు. ఇలా ఆర్డ‌ర్ వ‌చ్చిన ప్ర‌తిసారి త‌న‌కు లాభం వ‌చ్చేది.

ఈ మార్కెటింగ్‌పై ఆశ పెంచుకున్న అవినాష్ స‌రిగ్గా మూడునెల‌ల్లో వాటి వివ‌రాలు తెలుసుకున్నాడు. బిజినెస్‌ను మ‌రింత పెద్దదిగా మార్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఒక ల‌క్ష రూపాయ‌ల‌తో వ్యాపారం చేసిన Avinash కు ఒక వారంలోనే రూ.5 ల‌క్ష‌లు లాభం వ‌చ్చింది. కానీ తాను ఎంచుకున్న ప్రొడ‌క్ట స‌ప్ల‌యిర్‌ నాణ్య‌మైన‌వి పంపించ‌క‌పోవ‌డంతో రివ్యూస్ మంచిగా రాలేదు. అదే స‌మ‌యంలో మ‌రో ప్రొడ‌క్ట స‌ప్ల‌యిర్‌ను సంప్ర‌దించాడు. ఈ సారి రూ.7 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెరిగింది.

స‌రేన‌ని ఉన్న ఐదు ల‌క్ష‌ల‌తో క‌లిపి మ‌రో రూ.2 ల‌క్ష‌లు Loan తీసుకొని మ‌ళ్లీ ఏడు ల‌క్ష‌ల‌తో ప్రొడ‌క్ట్‌ను కొనుగోలు చేశాడు. కానీ ఈ సారి మాత్రం రూ.3 ల‌క్ష‌లు మాత్ర‌మే వారానికి వ‌చ్చాయి. దీంతో వ్యాపారంలో రూ.10 ల‌క్ష‌లు న‌ష్టం వ‌చ్చింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే స‌మ‌యంలో మ‌రో స‌మ‌స్య అవినాష్‌కు వ‌చ్చింది. తండ్రి కూడా వ్యాపారంలో రూ.30 ల‌క్ష‌లు లోన్ తీసుకున్నాడు. అటు తండ్రికి కూడా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

అవినాష్ కూడా అప్పులు తీర్చుకునేందుకు లోన్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అవినాష్ – తండ్రి ఇద్ద‌రూ అప్పుల్లో కూరుకుపోయారు. కానీ వారికి మిగిలింది ఆరు నెల‌లు మాత్ర‌మే. పంజాబ్‌లో ఇంజ‌నీరింగ్ చేస్తున్న అవినాష్‌కు ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఒక రోజు ఫేస్‌బుక్‌లో ఒక కంపెనీ ఈ కామ‌ర్స్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అదే స‌మ‌యంలో Instagram డౌవ‌ల‌ప్ అవుతుంది. కంపెనీకి ఫాలోవ‌ర్స్ కావాల్సి ఉంది.

avinash mada

అలా కంపెనీ త‌న‌కు మంచి అవ‌కాశం ఇచ్చింది. ఏడు రోజుల్లో కంపెనీకి మూడు వేల మంది ఫాలోవ‌ర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందించాడు. అలా అందించినందుకు ఏడు రోజుల‌కు అవినాష్‌కు ఆ కంపెనీ రోజుకు 4,500 ఇచ్చింది. అలా ప్ర‌తి రోజూ 4,500 తీసుకున్నాడు. అలా మ‌ళ్లీ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నాడు. క‌స్ట‌మ‌ర్ల‌లో డీల్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ప్ర‌తి రోజూ క‌స్ట‌మ‌ర్ల‌కు ఫోన్ కాల్,మెస్సేజ్ చేసేవాడు. ఇలా ఆరు నెల‌ల్లో 8 ల‌క్ష‌లు సంపాదించాడు.

ఇంజ‌నీరింగ్ సెకండ్ ఇయ‌ర్‌లోనే కాలేజీ వెళ్ల‌కుండా వ్యాపారం మొద‌లు పెట్టాడు. ఇలా మ‌ళ్లీ వ్యాపారంలో దిగిన అవినాష్ ఇప్పుడు అప్పుల‌న్నీ తీర్చేశాడు. లాభాల‌తో ముందుకు సాగుతున్నాడు. ఈ సంద‌ర్భంగా అవినాష్ మాట్లాడుతూ స‌మ‌స్య ఎంత పెద్ద‌దైనా ప‌రిష్కారం దొర‌కుతుంది. మ‌న ప్ర‌య‌త్నం మ‌నం చేయాలి. స‌మ‌స్య నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆలోచించాలి. అప్పుడు మ‌నం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌గ‌లుతామ‌ని Josh Talks లో ముగించాడు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *