ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్
Incubation Centers: Amaravati: ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటు చేయడం వల్ల టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు పూర్తి సహకారం అందించడం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. వినూత్న ఆలోచనల అంకుర్పారణకు ఇంక్యూబేషన్ సెంటర్లు ఉపయోగపడతాయని, ఫలితంగా సుస్టిర సంస్థల ఏర్పాటు సాధ్యమవుతుందని అన్నారు.
నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర టెక్రాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్(Incubation Centers) శంఖుస్థాపనలో భాగంగా గవర్నర్ వీడియో సందేశం ఇచ్చారు. భారత ప్రభుత్వం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ బోర్డు పరిధిలోని ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ డివిజన్, జెఎన్టియు కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశంలో కొత్త స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి కేంద్రం ఇటీవల రూ.1000 కోట్ల నిధిని ప్రారంభించిం దన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి ప్రభుత్వ స్టార్టప్ వ్యవస్థను పాదుకొలపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆంధ్ర టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్(Incubation Centers) వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, క్లీన్-టెక్, ఎనర్జీ, కల్పన, కొత్త టెక్నాలజీతో ఇన్నోవేషన్ ఆధారిత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందన్న ఆశాభావాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వ్యక్తం చేశారు.
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?