Job Background Verification | కష్టపడి చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. మనం ఇప్పటి వరకు చదివిన చదువు మనకు కెరీర్లో ఉపయోగపడేవిధంగా ఉండాలనే ఆలోచిస్తాం. అసలే పేద, మధ్య తరగతి కుటుంబాల యువత ఏదో ఒక ఉద్యోగం చేయాలి, మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. వీటన్నింటికీ ముఖ్యమైన మార్గం ఉద్యోగం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత వరకూ టెన్షన్ కాస్త ఉంటూనే ఉంటుంది. ఆ ఉద్యోగం వస్తుందా? వస్తే బాగుండు లైఫ్ సెటిల్ అవుతుందని అనుకునే వారు లేకపోలేదు.
Job Background Verification ఎలా ఉంటుందంటే?
ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మీకు ఒక మంచి కంపెనీ నుండి జాబ్ ఆఫర్(Job offer) వస్తే అది సంతోషకరమైన విషయమే. కానీ ఉద్యోగంలోకి మిమ్మల్ని తీసుకునే క్రమంలో జరిగే ప్రాసెస్‌నే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు. ఇది మంచి కంపెనీల్లో జాబ్ సంపాదించాలనే వారికి ఒక సవాల్‌గా చెప్పవచ్చు. చిన్న చిన్న కంపెనీలను ప్రక్కన పెడితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుని మీకు రూ.50,000 జీతం ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి వారనేది వారికి తెలియాల్సి ఉంటుంది కదా. అందులో భాగంగానే ఈ సొసైటీలో మీ నడవడిక, ప్రవర్తన, ఎడ్యుకేషన్(education) విధానం, పూర్వ కంపెనీలో మీ అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంటాయి.

మీకు ఏదైనా మంచి కంపెనీ జాబ్ ఆఫర్ సూచించినప్పుడు మీరు వెళ్లి ఇంటర్వ్యూ లో పాల్గొన్న తర్వాత మీకు ఉద్యోగం ఇవ్వాలా? లేదా? అనే సమయంలో ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకుంటారు. వెరిఫికేషన్ చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకుంటారు. మరికొన్ని కంపెనీలు అయితే ఇంటర్వ్యూ చేసిన సభ్యులే వెరిఫికేషన్‌లో కూడా పాల్గొంటారు.
వెరిఫికేషన్‌లో ఏమి పరిశీలిస్తారు?
ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మొదటగా పరిశీలించేది మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెజ్యూమ్(Resume). మీరు ఏ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. మీరు ఎక్కడ చదువుకున్నారు? రెజ్యూమ్‌లో మీరు పొందుపర్చిన అంశాలకు సరిపోతున్నాయా? లేదా? ఒక వేళ ఇది ఫేక్ సర్టిఫికిట్లా? నిజమైనవేనా? అనేవి వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఇంతకు ముందు ఏ కంపెనీలో పనిచేశారు? అక్కడ మీకు ఎంత అనుభవం ఉంది? మీరు పనిచేసిన కంపెనీ ఆ స్థలంలో ఉందా? లేదా? అనేది లోకేషన్‌కు వెళ్లి కూడా చూస్తారు. మీరు చేసిన కంపెనీలో మీకు తెలిసిన వారి వివరాలు అడుగుతారు. ఉదాహరణకు మీ టీం మేనేజరు మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, లేదా హెచ్ ఆర్ వివరాలు ఇవ్వమని కూడా అడుగుతారు.
బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో క్రిమినెల్ కేసు(CRIMINAL CASE)ల పరంగా కూడా మీపై వెరిఫికేషన్ తప్పకుండా ఉంటుంది. మీపై ఏమన్నా ఇది వరకు కేసులు ఉన్నాయా? ఎలాంటి కేసులు ఉన్నాయి? అనేది కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని కంపెనీల్లో మాత్రం మెడికల్ చెకప్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ ఆరోగ్య విషయాలను కూడా అడిగి తెలుసుకుంటారు. ఇక ముఖ్యంగా మీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంపైనా కూడా వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వాడుతున్నా చెక్ చేస్తారు. అందులో మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. విద్వేషపూరిత కామెంట్లు, పోస్టులు ఏమైనా పెడుతున్నారా? ఎవరినైనా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో చెడ్డ ప్రచారం చేస్తున్నారా? అని కూడా వెరిఫికేషన్ చేస్తారు.

ముందే చెబితే ఎంతో ప్రయోజనం!
ఒక వేళ మీరు కంపెనీకి అత్యవసరం అయి ఉండి, మీరు వాళ్లకు నచ్చిన తర్వాత బ్యాగ్రౌండ్ వెరిఫికేషనలో పైన తెలిపిన వాటిల్లో ఎక్కడైనా మీ మీద రిమార్క్ ఉంటే కచ్చితంగా మిమ్మల్ని రిజక్ట్ చేస్తారు. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ చేస్తే, మరికొన్ని కంపెనీలు జాబ్‌లో జాయిన్ అయిన ఒక నెలకో, రెండు నెలలకో ఈ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్‌లో రిమార్క్ ఉంటే కచ్చితంగా జాబ్‌లో నుంచి తీసివేసే అవకాశం ఉంటుంది. అలాంటివి కొన్ని సంఘటనలూ జరిగాయి. కాబట్టి మీరు ఇంటర్వ్యూ లోకి వెళ్లిన తర్వాత సెలక్ట్ ప్రాసెస్‌లోనే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా ఆ కంపెనీ సిబ్బందికి చెబితే చాలా వరకు మేలు కలుగుతుంది. అది కూడీ మీపై వెరిఫికేషన్ చేయక ముందే చెప్పాలి. అప్పుడు మీరు నచ్చి, మీ వ్యక్తిత్వం నచ్చి కూడా కంపెనీ ఒక అభిప్రాయానికి వస్తుంది.
ఈ బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్‌లో మూడు పద్ధతలు ఉంటాయి. ఒకటి గ్రీన్, రెండు ఆరెంజ్, మూడు రెడ్. వీటిని ఆధారంగా చేసుకుని మీ వెరిఫికేషన్ రిపోర్టు తయారు చేస్తారు. వెరిఫికేషన్‌లో అన్ని మంచిగా ఉంటే మీరు గ్రీన్‌లోకి వెళతారు. ఒకటి రెండు రిమార్క్ ఉంటే ఆరెంజ్‌లోకి వెళతారు. మీరు కంపెనీకి సమర్పించినవి, మీ వ్యక్తిత్వం వెనుక అంతా రిమార్కులు ఉంటే రెడ్‌లోకి వెళతారు. కాబట్టి మీరు ఉద్యోగం చేయాలనుకుంటే అది కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ సంపాదించాలంటే ఈ బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ఆలోచించి మంచిగా ఉండటం మంచిది. కాబట్టి ఇప్పటికైనా మీ సోషల్ మీడియాలో ఎటువంటి విద్వేష పోస్టులు ఉన్నా ఇప్పుడే తీసివేయండి. మీపై ఎటువంటి కేసులు లేకుండా చూసుకోండి. ఆ కంపెనీ కాకపోతే మరో కంపెనీలో జాబ్కోసమైన సిద్ధంగా తయారు కండి. all the best.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!