Jillelamma Jitta: Folk Dancer Naga Durga యాక్ట్ చేసిన ప్రతి పాటకు యువత ఫిదా అవ్వాల్సిందే. ఆమె డ్యాన్స్ వేసిన ఎన్నో డిజె సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆమె యాక్టింగ్‌కు నిజంగా ఏ హీరోయిన్ సరిపోదని చెప్పవచ్చు. అంత నేచురల్‌గా డ్యాన్స్ వేస్తూ అభిమానుల గుండెల్లో ఇప్పుడు ఆరాధ్య దేవతగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన జిల్లేలమ్మా జిట్టా Dj Song అబ్బో వింటే మాత్రం పూనకాలు రావాల్సిందే మరి.
తెలంగాణ Folk సాంగ్స్‌కు డిజె మాంత్రికుడు లింగా అందిస్తున్న మ్యూజిక్కు ఒంట్లో వైబరేషన్ రావాల్సిందే మరి. డిజె లింగా ఆద్వర్యంలో వచ్చిన ప్రతి పాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఏ పాట చూసినా సూపర్ హిట్‌ను అందుకున్నాయి. మంచి డిజె అందిస్తున్న వారిలో లింగా ఒక్కరు. పాటకు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా, మ్యూజిక్ దెబ్బతినకుండా డిజె మిక్సింగ్ అద్దినట్టు చేయడం లింగా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ పాట కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే మాత్రం మరో లోకంలో తేలియాడినట్టే మరి.
జిల్లేలమ్మా జిట్టా సాంగ్‌కు మానుకోట ప్రసాద్ అద్బుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాటలో అమ్మాయి తనను ప్రేమించిన బావపై ఎలా ప్రేమ చూపుతుందో తెలుపుతుంది. తన మేనత్త కొడుకు బావ తనపై ఎలా ప్రేమ చూపుతాడో తెలుపుతుంది. తన చేష్టలకు మమైరిచిపోయి ఆ ప్రేమకు ఫిదా అవుతుంది. నిజంగా బావ-మరదలు పై వచ్చిన పాటల్లో ఈ పాట ఒకటి టాప్‌లో నిలిచిపోతుంది. అద్బుతమైన లిరిక్స్ అందించిన మానుకోట ప్రసాద్ అన్నకు హ్యాట్సాఫ్.
సింగర్ శ్రీనిధి స్వరంలో ఏదో తియ్యని, కమ్మని హత్తుకుపోయే ప్రేమ ఉంది. నిజంగా ఆమె పాడిన Jillelamma Jitta ను వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది. అంత అద్భుతంగా పాడారు ఆమె. నిజంగా ఆమె స్వరంతో ఈ పాటను మరింత హైప్ తీసుకెళ్లారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా పాటల్లో పాడే పెద్ద పెద్ద సింగర్స్‌కు తీసిపోని స్వరంతో అద్భుతంగా పాడి, ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో మంచి సింగర్‌గా స్థానం సంపాదించుకున్నారు.
మ్యూజిక్ KALYAN KEYS అంటే అందరికీ సుపరిచితుడు. యూట్యూబ్‌లో వచ్చే ప్రతి ఫోక్ సాంగ్‌లో సగానికి సగం కళ్యాణ్ కీస్ మ్యూజిక్ నుండి విడుదలైనవే. పాట ఏ శైలిలో ఉంటుంది, ఏలాంటి సంగీతం అందిస్తే అది ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిరుచికి తగ్గట్టుగా పాటకు మ్యూజిక్ అందించడం గొప్ప విషయం. ఈ పాటలో అద్భుతమైన కొరియోగ్రఫీ SHEKAR VIRUS అందించారు. నాగ దుర్గ అందం, అభినయం ఒక ఎత్తు అయితే, ఆమె డ్యాన్స్ మరో ఎత్తు. ఆమెకు ఆ డ్యాన్స్ నేర్పించిన శేఖర్ తన ప్రతిభను చాటుకున్నారు. పాటలో ప్రతి ఒక్క నటి అద్భుతంగా నటించారు. గ్రూప్ డ్యాన్స్‌తో అదరగొట్టారు.
జిల్లేలమ్మా జిట్టా DJ సాంగ్ ను యూట్యూబ్‌లో రోజుకు ఒక్కొక్కరు 10 సార్లు కంటే ఎక్కువ వింటున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఎక్కడ పెళ్లి ఫంక్షన్లు జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ఈ పాట డిజె లో రీసౌండ్ ఇవ్వాల్సిందే. పాట చాలా బాగుందని, ఇంకా నాగదుర్గ డ్యాన్స్, నటన కు అభిమానులయ్యామని చెబుతున్నారు. పాట మ్యూజిక్, తీసిన విధానం అంతా సూపర్ అంటున్నారు. ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుతున్నారు. ఈ పాటను మీరు కూడా ఒక సారి చూడండి. పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఉంది.
Jillelamma Jitta Dj Song Credits
Song Name | JILLELAMMA JITTA DJ |
LYRICS | MANUKOTA PRASAD |
SINGER | SRINIDHI |
MUSIC | KALYAN KEYS |
ACTOR | NAGA DURGA |
PRODUCERS | SHANKARSAHITHI NARASIMHA AMMOLU |
DJ MIXING | LINGA |
Youtube Video Song | Link |