Jeevan Aastha Helpline | మనిషి పుట్టినప్పటి నుంచి చస్తూ బ్రతుకుతూనే ఉన్నాడు. పేద, మధ్య, ధనిక అని తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో నిత్యం సతమతమవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తృణపాయంగా ప్రాణాలు తీసుకోవడానకి కూడా లెక్క చేయడం లేదు. టివి ఆన్ చేసినా, వాట్సాఫ్ ఆన్ చేసినా, ఇతర సోషల్ మీడియా ఏది చూసినా ఎక్కడో ఒక చోట ఓ మనిషి సెల్ఫీ వీడియోతో తన బాధను చెప్పుకుంటూ చివరకు ఆత్మహత్యకు పాల్పడున్నాడు. ఈ ప్రపంచంలో సాటి మనిషి అని చూడకుండా మూర్ఖత్వంతో, మృగం రూపంతో ఎదుట వ్యక్తిని అవలీలగా హింసిస్తూ, మానసిక క్షోభకు గురిచేసి చివరకు ఆత్మహత్య చేసుకునే వరకు తమ చేష్టలను చూపిస్తున్నారు.
ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి సమాజంలో కొందరితోనో, బంధువులతోనో, ఆఖరికి కుటుంబసభ్యులతోనో దూషించబడుతూ, అవమాన పడుతూ భయపడుతూ బ్రతుకుతూనే ఉన్నాడు. అది మానసికంగా కావచ్చు. శారీరకంగా కావచ్చు. ఇలా ఓపిక పడుతూ ఎదురించే వారు 20 శాతం ఉంటే భయపడి ప్రాణాలు తీసుకునే వారు సుమారు 75 నుంచి 80 శాతం మంది ఉన్నారు. ఇటీవల సామూహిక ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాం. రోజుకి ఎక్కడో ఒక చోట ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కారణం వారికి ధైర్యం చెప్పేవారు లేక, వారి బాధను నలుగురితో పంచుకోలేక మానసిక క్షోభకు గురవుతూ చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఒక్కసారి ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించు!
ఆత్మహత్యలు చేసుకుందామనుకుంటున్న వారికి ధైర్యం చెబుతూ, జీవితంపై ఆశలు పెంచుతూ ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీవన్ ఆస్తా హెల్ప్‌లైన్(Jeevan Aastha Helpline). ఈ సమాజంలో ఎవరైనా చనిపోవాలని అనుకుంటున్నా, చనిపోవడానికి ఇతరులు కారణంగా అవుతున్నా సరే ఒక్కసారి జీవన్ ఆస్తా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే చాలు. మన పరిష్కారం సులభం అవుతుంది. మనకు నెమ్మది కలుగుతుంది. ఈ హెల్ప్ లైన్ గురించి ఎక్కువుగా ఎవ్వరికీ తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారు మరో ఆలోచన చేయలేకపోతున్నారు. వారికి ఇతరులు చెప్పలేకపోతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కల అంచనా ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంట. ఈ ఆత్మహత్యలకు పాల్పడే వారిలో ఎక్కువుగా కౌమార, యవ్వన వయసుతో పాటు మధ్య వయసు వారు కూడా ఉన్నారంట. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ కనీసం 50 సంవత్సరాలు కూడా పూర్తి ఆయుషుతో జీవించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ హెల్ప్ లైన్ ఎంతో సహాయపడుతుంది. వారికి అండగా నిలుస్తుంది. మన భారత దేశంలో ఆత్మహత్యల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఓ కార్యక్రమం ఇది. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ముందుగా జీవన్ ఆస్తా హెల్ప్ లైన్ నెంబర్ 1800 233 3330 కు ఫోన్ చేస్తే వారు వెంటనే స్పందిస్తారు. మీ సమస్యకు పరిష్కారం చెబుతారు.
ఎవరైనా మానసికంగా బాధపడుతున్నా, జీవితంపై విరక్తి చెందినా, ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నా వారందరూ ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. వారు అవసరమైతే మీ దగ్గరకు వస్తారు. మీ ఇంటిలో మీతో కూర్చొని మాట్లాడతారు. సమస్యకు పరిష్కారం చెబుతారు. మీరు ఎలాంటి బాధలో ఉన్నారో దాని నుండి మిమ్మల్ని బయటపడవేసి మామూలు మనిషిని చేస్తారు. ఫోన్లో మాట్లాడినా సరే మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుతారు. ఇది పూర్తి ఉచితం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెంబర్‌ను ఉపయోగించుకోండి. ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న వారికి ఈ నెంబర్ ఇవ్వండి. వీలైతే మీరు కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం. సమస్యకు పరిష్కారం ఎలానో వివరించండి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!