JEE Main 2022 Dates | దేశవ్యాప్తంగా ఉన్న IIT, IIIT,NIT ల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలల్లో రెండు దశల వారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకు ముందు నాలుగు సార్లు పరీక్ష రాసే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది రెండు సార్లకు మాత్రమే ఎన్టీఎ పరిమితం (JEE Main 2022 Dates)చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 31 వరకు జేఈఈకి రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16,17,18,19,20,21వ తేదీల్లో, రెండో దశ పరీక్షలు మే 24,25,26,27,28,29 తేదీల్లో జరగనున్నాయి. పరీక్షలకు వయో పరిమితి లేదు. 2020, 2021 సంవత్సరంలో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్తులు మాత్రమే అర్హులు. ఈ ఏడాది 2022 ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు ఊడా అర్హులేనని ఎన్టిఏ తెలిపింది. ఈ ఎగ్జామ్స్‌ను తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో రాసే వీలుంది. గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల జేఈఈ షెడ్యూల్ గందరగోళంగా తయారయ్యింది. ఆ సమయంలో విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం కూడా కష్టతరమైంది.
ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులంతా కోచింగ్ తీసుకునేందుకు ఇప్పటికే నగరాలకు వెళ్లారు. కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సింది ఉంది.ఈ క్రమంలో బోర్డ్ ఎగ్జామ్స్‌తో, జేఈఈ పరీక్షలు క్లాష్ అవుతాయేమోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ