JCPrabhakarReddy : Tadipatri : టిడిపి నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ కావడానికి జగన్ ఎంతో సహాయం చేశాడన్నారు. జగన్ తలుచుకుంటే ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను మున్సిపల్ ఛైర్మన్ అయ్యే పరిస్థితి లేదని తెలిపారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని పేర్కొన్నారు.
JCPrabhakarReddy : ఉత్కంట నడుమ ఛైర్మన్ పదవి కైవసం!
టెన్షన్ వాతావరణం నడుమ ఛైర్మన్‌గా టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికవ్వగా, వైస్ ఛైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టిడిపికి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్ అఫీసియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలను సైతం ఏర్పాటు చేశాయి. మొత్తానికి జేసీ ఎన్నికతో ఉత్కంఠకు తెరపబడినట్టయ్యింది. ఛైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం, గుండాయిజం ఇక ఉండబోదన్నారు. సేవ్ తాడిపత్రి తమ నినాదంగా పేర్కొన్నారు. తమ కౌన్సిలర్లు అందరూ బహుబలిలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory