Jaru Mitaya Troll: హీరో మోహన్ బాబు & వారి మంచు ఫ్యామిలీ ఏమి చేసినా ఇప్పుడు వింతగా ఫన్నీగా మారుతున్నాయి. యూట్యూబ్‌లో ట్రోలింగ్స్ అని సెర్చ్ చేస్తే మొదటి వరుసలో ఒక రెండు మూడు వీడియోలైనా వారిని Troll చేసినవే కనిపిస్తాయి. ఈ ఏడాదిలో ఎక్కువుగా ట్రోల్ అయిన హీరోల్లో మంచు ఫ్యామిలీ హీరోలు మంచు విష్ణు, మోహన్‌బాబు, వారి చిన్న కుమారుడు కాస్త ట్రోలింగ్‌కు గురయ్యారు.
వారి వీడియోలు పుణ్యమా అంటూ యూట్యూబ్‌లో ట్రోలింగ్ వీడియోలు చేసే యూట్యూబర్స్కు ఛానెళ్లు పాపులారిటీ పెరిగింది. Manchu Vishnu ట్రోలింగ్ వీడియోలు పదుల సంఖ్యలో యూట్యూబ్‌లో ఉన్నాయి. కాస్త ఉపశమనం పొందాలంటే ఒత్తిడిని బయట పడాలంటే ఈ వీడియోలు చూస్తే చాలురా బాబు అనే నెటిజన్లు లేకపోలేదు.
ఇక ఈ మధ్య కాలంలో హీరో మంచు విష్ణు తీసిన Ginna సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో మోహన్ బాబు సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా నుంచి కొందరి కళాకారులను ఆడియో ఫంక్షన్‌కు పిలిపించారు. ఇక స్టేజీ మీద వారు పాడిన తీరు చూసి అందరూ షాక్ (Jaru Mitaya Troll) అయ్యారు. వారు పాడిన పాటల్లో కాస్త బూతు అర్థంలా అర్థం చేసుకోవడంతో నెటిజన్లు మళ్లీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు.


నేను జడేస్తాను జూడు..నేన జడేస్తాను జూడు..
నా జడసైజు చూడకుంటే తీసేస్తా చూడు..
ఓ జంపలకిడి జారు మిఠాయ..
ఓ జంపలకిడి జారు మిఠాయ..
నేను పూలు పెడతా చూడు
నేను పూలు పెడతా చూడు
నా పూలు సైజు చూడకుంటే తీసేస్తా చూడు
ఓ జంపలకిడి జారు మిఠాయ..
జాకిటేస్తా చూడు నేను జాకిటేస్తా చూడు
నా జాకెట్ సైజ్ చూడకుంటే తీసివేస్తా చూడు
నేను ఆడదాన్ని కాదంటరా మొగడో!


వారి పాడిన విధానం ఇలా చెప్పే కంటే ఒక్కసారి ట్రోలింగ్ వీడియోలు చూస్తే మీకు నవ్వు రాకుండా ఉండదు. వారి పాటలు (Jaru Mitaya Troll) ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెడింగ్ అయ్యాయి. వారు కూడా ట్రోలింగ్స్‌తో మంచు ఫ్యామిలీతో పాటు ట్రెడింగ్ అయ్యారు. ఈ జారుమిఠాయి సింగర్స్ వీడియోను ట్రోలర్స్ డిఫరెంట్ మీమ్స్ మధ్యలో యాడ్ చేసి ఐలెట్ చేశారు.
Jaru Mitaya trollers comments
యూట్యూబ్‌లో ఈ జారుమిఠాయి సింగర్స్ టోలర్స్ వీడియో చూసిన వీక్షకులు కామెంట్ల వర్షంతో యూట్యూబ్‌ను బాక్స్‌ను నింపేస్తున్నారు. ఒక విధంగా మంచు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రోల్ క్రియేటర్స్‌కు హెల్ప్ చేస్తున్నారని అంటున్నారు. వాస్తవంగా ఈ పాటల వల్ల ఆడియన్స్ థియేటర్‌కు వచ్చారని మరొకరు అన్నారు.


ఇక ఈ ట్రోలింగ్‌లను ఇంట్లో పెద్దలే కాకుండా పిల్లలు కూడా చూస్తూ నవ్వుతున్నారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. చెరిత్ర సృష్టించినా తిరగరాయాలన్నా మంచూకీ, మంచే, ఈ పాట విన్నాక మా ఊరిపై నుండి వెళ్లే విమానాలు రానేలేదు. ఆచూకీ తెలియజేయగలరని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.
షాకింగ్ విషయం ఏమిటంటే జిన్నా మూవీ కంటే వీళ్ల వీడియోలకే ఎక్కువుగా వ్యూస్ వచ్చాయట. పాపం స్నో ఫ్యామిలీ కోసం వీళ్లు బలయ్యారని మరొకరు కామెంట్ చేశారు. జంబలకిడి జారు మిఠాయి వాహ్ లిరిక్స్ను వేటూరి, సిరి వెన్నల కూడా రాయలేదు. రాయలేరు కూడా అని మరొకరు కామెంట్ చేశారు.


మరికొందరు ఈ Jaru Mitaya సింగర్స్ వీడియో ట్రోలింగ్ (Troll) ను చూసి అభిమానం వ్యక్తం చేస్తున్నారు. వారు పల్లెటూరు వాళ్లు. వాళ్లు వచ్చి అంత మందిలో పాడటం గ్రేట్. అసలు వాళ్లు ఎలా పాడితే మీకు ఎందుకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.