Janasena news today: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం గన్నవరం విమానాశ్ర యానికి వచ్చారు. అక్కడ నుంచి నేరుగా మంగళగిరి లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Janasena news today: తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తూడవడంతో పాటు ఎప్పటికీ వారి తరపునే నిలబడి పోరాడుతోందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కరోనా భారిన పడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం వారు మాట్లారు. కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు కూడా చాలా మందిని కోల్పోయానన్నారు. ఈ విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున నివాళులు అందజేస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేందుకు జనసేన కృష్టి చేస్తోందని, అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడిందని అన్నారు. పార్టీ బీమా పథకానికి తాను రూ.కోటి ఇచ్చానని పేర్కొన్నారు. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్‌ను కలిసిన కాలనీ వాసులు!
పవన్ కళ్యాణ్‌ను తాడేపల్లి అమరరెడ్డి కాలనీ వాసులు కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నివాసం చుట్టూ ఉన్నవారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని మాకు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నిర్థాక్షిణ్యంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి ప్రొక్లెయిన్లను ఇళ్ల మీదకు పంపిస్తున్నారని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి బెదిరిస్తున్నారని పవన్‌కు తెలిఆపరు. 30 ఏళ్లుగా ఉంటున్న మాకు గూడు లేకుండా చేయాలని చూస్తున్నారని విన్నవించుకున్నారు. మాకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్ కు విన్నవించుకున్నారు.


బాధితులు చెప్పిన ఫిర్యాదును విన్న అనంతరం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… సిఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ చేయిస్తారా? ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాయకులు ఉంటే మానభంగాలు ఎలా ఆగుతాయని విమర్శించారు. సిఎం చుట్టూ ఉన్నవారికే రక్షణ లేదని హెద్దేవా చేశారు. 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాలని, భయపెట్టి, బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు ఎవరూ భయపడరని పేర్కొన్నారు. ఖాళీ చేయించడం తప్పనిసరైతే.. వారికి ముందు న్యాయం చేయాలని, 350 కుటుంబాలకు ఇళ్ళు ఇచ్చాకే వారిని తొలగించాలని సూచించారు. మొండిగా ముందుకెళితే.. జనసేన తరపున సిఎం నివాసం వద్దే ఉద్యమిస్తామన్నారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!