Janasena meeting in Ippatam | జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోమవారం ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వచ్చినా శంకుస్థాపనతో పాలన మొదలవుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో ప్రారంభించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు నాశనం అయ్యాయి. ఇంత విధ్వంసపూరిత ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. వైసీపీ నాయకత్వంపైన, మంత్రులపైన వ్యక్తిగత విబేధాల్లేవని అన్నారు.
Janasena meeting in Ippatam
వైసీపీలో మేకపాటి ఫ్యామిలీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మాగంటి శ్రీనివాసరెడ్డి వంటి మంచి నాయకులు ఉన్నారంటూనే ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్ సెటైర్స్ వేశారు. తాను మీటింగ్కు బయల్దేరే ముందే వైసీపీ నాయకులు, మంత్రులు తిట్టడం ప్రారంభించారని అన్నారు. వెల్లం పల్లి..వెల్లుల్లిపాయ, బంతి..చామంతి..పూబంతి..గోడకు కొడితే తిరిగిరాని బంతి..అవంతి..వీళ్లేదో మాట్లాడుతున్నారట అని పవన్ ఎద్దేవా చేశారు.
సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారవని, ఏ ప్రభుత్వం చట్టం చేసినా, అది కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజధానులకు భూములివ్వని చేసుకున్నప్పుడు వైసీపీ నేతలు గాడిదలు కాశారా? మూడు రాజధానులు చేస్తామని అప్పుడే వైసీపీ నేతలు చెప్పొచ్చుగా అని విమర్శించారు. 32 వేల ఎకరాలు సరిపోవని జగన్ అన్నారని, 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 30% మంది ఎస్సీలు ఉన్నారని అన్నారు.
చట్టసభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందేనని..శాసనాలు చేసేవారే పాటించని వారి మాటకు ఎందుకు వినాలని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చట్టాలను పాటించకపోతే న్యాయదేవతను ప్రశ్నించే హక్కు, వైసీపీకి ఎక్కడది? అని, హైకోర్టు పార్టీ బ్రాండ్ ఆఫీసుగా మారిందని తిడతారా? అని వైసీపీ గూండాగిరి పెరిగిపోయిందని అన్నారు. క్రిమినల్స్ రాజకీయాల్లో వస్తే ఇలానే ఉంటుందని, ఒక్క ఛాన్స్ ఇస్తే..ఏపీ పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని పవన్ అన్నారు.

అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ కొమ్ములను వచ్చే ఎన్నికల్లో విరగకొడతామని పవన్ చెప్పారు. వైసీపీని గద్దె దించడం కోసం బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని, కాంగ్రెస్కు వ్యతిరేకంగా శక్తులన్నీ ఎలా కలిశాయో, అలాగే వైసీపీ కి వ్యతిరేకంగా ఉండే పార్టీల ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల గురించి వచ్చినప్పుడు పొత్తుల గురించి అప్పుడు ఆలోచిస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ