Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాలయాలను రక్షించడంలో ప్రభుత్వం విఫలంRajamahendravaram: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విగ్రహాల దాడి ఘటన వెలుగు చూసింది. నూతన సంవత్సరం లో కి ప్రవేశించిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటన మరో సారి రాజకీయంగా విమర్శలకు, ప్రతివిమర్శలకు దారి తీసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొన్న రామతీర్థం, నిన్న రాజమహేంద్రవరంలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం అయ్యాయని, వైసీపీ ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు నిత్యం పరిపాటిగా మారాయని బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఏపిలో దేవాలయాలను రక్షించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయా పార్టీలో ఆరోపిస్తున్నాయి.
విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే: జనసేన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాజమహేం ద్రవరంలో చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటన ఆవేదనకు గురిచేసిందని అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను ఖండించడం దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. పాకిస్థాన్ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్ర హాలు పగలగొడుతూ ఉంటారని చదువుతుంటాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్థం స్వయంగా చూస్తున్నామని పవన్ కళ్యాణ్ హెద్దేవా చేశారు.


భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకున్న రామతీర్థం క్షేత్రం లో కొద్ది రోజుల కిందటే కోదండరాములవారి విగ్రహం తలను నరికి పడేసి మత మౌఢ్యం పెచ్చరిల్లడం ఆందోళనకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ బాధ మరువముందే దేవ గణాలకు సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను నరికి వేయడం చూస్తే ధ్వంసం రచన పరాకాష్టకు చేరుతున్నట్టు అనిపిస్తోందని ఆరోపిం చారు.
ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారనే విషయం తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాణ్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
రామతీర్థం క్షేత్రంలో విగ్రహాల తలను నరికిన ఘటనపై సీఎం స్పందన ఉదాసీనంగా ఉందని ఆరోపించారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ చెప్పడం చూస్తే ఈ వరుస దాడులపై ఆయన ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు నేరం చేసేవారిని నిలువరించవని, మరో దుశ్చర్యకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని ఆరోపించారు.
దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అంతర్వేధి ఘటనపై నిరసన తెలిపినవారిపైనా అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులు పెట్టిన ప్రభుత్వం, హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తోందని పవన్కళ్యాణ్ ప్రశ్నించారు.
విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదని, పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవదాయ శాఖ అనేది ఒకటి ఉందా ? అనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. హిందూ దేవాల యాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలని తెలిపారు. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలని పేర్కొన్నారు.
విగ్రహాల ఘటనపై టిడిపి, బిజెపి పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో విగ్రహాల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న రామతీర్థం, నిన్న రాజమ హేంద్రవరంలో దేవుళ్లు విగ్రహాలు ధ్వంసం కావడం విచారకరమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే హిందువల మనోభావాలు గాయపరిచేలా ఆలయాలపై దాడులు నిత్యకృతమయ్యాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు 125 కి పైగా గుడులలో విధ్వంసాలు జరిగినా ఒక్క నిందితుడిని పట్టుకోలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వీడియో-
ఇది చదవండి: నకిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు