Janasena – BJP contest in AP Panchayat Elections 2021 | స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలు

Janasena – BJP contest in AP Panchayat Elections 2021 | స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలుVijayawada :  స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు బుధ‌వారం ఉద‌యం జ‌న‌సేన నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం సోము వీర్రాజు, నాదేండ్ల మ‌నోహ‌ర్ చ‌ర్చ‌లు అనంత‌రం మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా నాదేండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌర‌వించ‌కుండా, ప్ర‌జ‌ల శ్రేయస్సుకోసం అంకిత‌ భావంతో ప‌నిచేయ‌కుండా నియంతలా వ్య‌వ‌హ‌రించార‌ని విమ‌ర్శించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌మిస్తామ‌న్నారు.

Janasena - BJP contest
స‌మావేశంలో నాదేండ్ల మ‌నోహ‌ర్ – సోము వీర్రాజు

ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాలి: సోము వీర్రాజు

గ‌తంలో జ‌రిగిన హింసాత్మ‌క ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం నిలిపివేయాల‌ని, ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఇత‌ర పార్టీలు పోటీలు ఉండొద్ద‌న‌డం స‌రికాద‌ని, తాము ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై చ‌ర్చిస్తామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగం చేస్తే గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాయ‌ని వీర్రాజు స్ప‌ష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా నామినేష‌న్లు వేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ నెల 29లోగా ఆన్‌లైన్ నామినేష‌న్ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక అభ్య‌ర్థిపై త‌మ‌కు స్ప‌ష్ట‌మైన విధానం ఉంద‌ని అన్నారు. ఇరు పార్టీలు పొత్తుతో అంద‌రికీ ఆమోద యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఇరు పార్టీల‌కు ఎక్క‌డెక్క‌డ ఎంత బ‌లం ఉందో చూసి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు.

ఇది చ‌ద‌వండి:హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

ఇది చ‌ద‌వండి:ఈ ఎన్నిక‌ల‌కు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ

ఇది చ‌ద‌వండి: క‌రోనా సేవ‌ల‌కుగాను సీఐకి ప్ర‌శంసాప‌త్రం అంద‌జేత‌

ఇది చ‌ద‌వండి: ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఇది చ‌ద‌వండి:పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్ల వివ‌రాలు 

ఇది చ‌ద‌వండి:నూత‌న స‌చివాల‌యం నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

చ‌ద‌వండి :  పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *