Janagam Crime News: Telangana TDP Leader Murder | రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
Janagam Crime News: Telangana TDP Leader Murder | రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులుJanagam: జనగామ పట్టణంలో భవానీనగర్‌కు చెందిన తెలంగాణ తెలుగు దేశం పార్టీ (టిటిడిపి) నాయకుడు, మాజీ కౌన్సిలర్ పులి స్వామి(52)ను గురువారం ఉదయం 6.10 గంటల సమయంలో జనగామ- వరంగల్ హైవేలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో ప్రత్యర్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన జరిగిన రెండు గంటల్లోనే గడ్డం నిఖిల్(22), అబ్బు ప్రవీణ్ కుమార్ అలియాస్ హృతిక(19) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను మీడియా ఎదుట హాజరపర్చిన అనంతరం డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమి వివాద కేసులో స్థానిక సివిల్ కోర్టు పులి స్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరూ ఉదయం నగకలో బయలు దేరినప్పుడు స్వామిపై దాడి చేసినట్టు తెలిపారు. జాతీయ రహదారి వెంబడి యశ్వంత్‌పూర్ గ్రామంలో 2.30 ఎకరాలకు పైగా భూమి పులి స్వామి, నిందితుడి తాత గద్ధం నరసింహ కుటుంబం మధ్య సివిల్ కేసు నడుస్తోంది. 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసును పులి స్వామికి అనుకూలంగా కోర్టు బుదవారం తీర్పు ఇచ్చింది. తీర్పు తనకు అనుకూలంగా ఉన్నందున, నిందితులను స్వామిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దాడిలో భాగంగా మోటారు సైకిత్తో ఢీకొట్టిన తర్వాత గొడ్డలితో దాడి చేశారని డీసీపీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ వినోద్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్
ఇది చదవండి:తిరుపతి ఉప ఎన్నికలో జనసేన-బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి
ఇది చదవండి:నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!