Jamulamma Reservoir గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ జమ్ములమ్మ దేవస్థానం దగ్గర ఉన్న జమ్ములమ్మ రిజర్వాయర్లో బోట్లు నిరుపయోగంగా ఉండటంపై భక్తులు నిరాశ చెందుతున్నారు. తెలంగాణ టూరిజం వారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎంతో అట్టహాసంగా బోటు షికారుల కొరకు బోట్లను ఏర్పాటు చేశారు. కానీ టూరిజం శాఖ వారు పట్టించుకోకపోవడం తో శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారడంతో దేవాలయానికి వచ్చిపోయే భక్తులు నిరాశ(Jamulamma Reservoir) చెందుతున్నారు.
బ్రహ్మోత్సవాల వేళ!
వచ్చే నెల ఫిబ్రవరిలో జమ్మి చేడు జమ్ములమ్మ జాతర బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జమ్మి చెడు జమ్ములమ్మ అవ్వకు మొక్కులు తీర్చుకుంటారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే జమ్మి చెడు జమ్ములమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులు, పిల్లలు తెలంగాణ టూరిజం వారు ఏర్పాటు చేసిన బోటు షికారు చేసి కాలయాపన చేసేవారు. ఇప్పటికైనా టూరిజం శాఖ స్పందించి బోటు షికారు కొరకు బోట్లను ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ