Jalandhar nayak story కొత్తగా జిల్లాకు రాగానే 10 రోజులు హంగామా హైరానా చేసి ప్రజలలో మంచిపేరు సంపాదించుకొని ఆ తర్వాత యదాతాదంగా మారిపోయే కలెక్టర్లు ఉన్న ఈ సమాజంలో ఇలాంటి మానవత్వం, మంచితనం, ప్రజల గురించి ఆలోచించే కలెక్టర్టు వందకో.. వెయ్యికో ఒకరు అరుదుగా కనబడతారు.
ఆమె..డాక్టర్ బృంద ఐఏఏస్. కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె..! కాస్తోకూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్..!అదసలే ఒడిస్సా..బీమారు రాష్ట్రాల్లో ఒకటి. అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి. అనేక గ్రామాలకు అసలు రోడ్లే ఉండవు. చదువు అసలే ఉండదు. వైద్య అందదు.. ఆమె ఒక రోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది. ఆ వార్త సంపూర్ణంగా చదవింది. వివరాలు తెప్పించకున్నది. ఓ కలెక్టర్గా సిగ్గు పడింది. ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా..!అని తలవంచుకుంది. డ్రైవర్ను పిలిచింది. గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది. డ్రైవర్ పరేషన్ అయ్యాడు. ఆమె కారులో బయల్దేరింది. ఆ ఊరు చేరుకున్నది. ఇక్కడ జలంధర్ నాయక్(Jalandhar nayak story) అంటే ఎవరు? అని అడిగింది. అప్పుడు ఆ మట్టి మనిషి కథ ప్రారంభమైంది.

ఆయన వయస్సు 45 . పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు..ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంజీ కథ తెలుసు కదా..సేమ్ , ఆయన ఒడిస్సా మాంజీ ..ఎందుకో తెలుసా? తనూ అంతే ..ఆ ఊరికి రోడ్డు లేదు.. నిజం చెప్పాలంటే? కరెంటు కూడా లేదు. మంచినీటి సరఫరా ఆశించేదే లేదు. ఒక్కొక్కరు ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్…ఎందుకు? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే.. ఎవరినీ ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయే…లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయే.. అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు. ఈ అధికారులు అని అర్థమైంది.. దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు.. కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా..? భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది. ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు..రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!