jai bhim movie best scene | పోరాడుదాం..పోరాడుదాం..న్యాయం దక్కేవరకు పోరాడదాం అంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తుంటారు. పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఈ పోరాటంలో నినాదాలు చేసేది హీరో సూర్య. అదే ప్రపంచ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ఒకటికి రెండు సార్లు చూసి స్ఫూర్తిని పొందిన ఏకైక సినిమా jai bhim. ఈ సినిమా 2021 సంవత్సరంలో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో న్యాయవాదిని ఓ పోలీసు అధికారి స్టేషన్లో కొట్టడంతో న్యాయవాదులు Policeలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న సన్నివేశం అది.
jai bhim movie best scene
ఈ సన్నివేశంలో పాల్గొన్న సూర్య (justice Chandru) దూరంగా ఉండి తన కోసం ఎదురు చూస్తున్న బాధితుల కోసం గేటు దూకి వచ్చే సన్నివేశం, న్యాయంకు తలుపులు తెరిచినట్టు కనిపిస్తుంది. ఒక ప్రక్క పోలీసు ఉన్నాతా ధికారి(ప్రకాశ్‌రాజ్) ఎంట్రీ అయి న్యాయవాదులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయితే న్యాయవాదిపై చేయి చేసుకున్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తుంటారు.
ఈ లాయర్ల పోరాటం జరుగుతుండగానే high courtలో ఒక్కసారిగా లైట్లు వెలుగుతుంటాయి. జస్టీస్ చంద్రు కేసుకు సంబంధించిన ఫైల్‌ను చేతబట్టుకుని కోర్టు లోపలికి అడుగుపెడుతున్న సమయంలో ఓ విలేకరి ఆసక్తికర వ్యాఖ్య చేస్తున్న సందర్భం మనం చూడవచ్చు. కొట్టిన పోలీసు అరెస్టు అయ్యే వరకూ కోర్టులో ఒక్క కేసు నడవదని న్యాయవాదులు తెగేసి చెబుతుంటారు. ఉన్నత న్యాయస్ధానం ముందర లాయర్లు పోలీసుల వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడుతున్న సమయంలో ఒకే ఒక్క లాయరు మాత్రం తన కేసును వాదించడానికి ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అంటూ విలేకరి ముగిస్తాడు.