Jai Balayya Song

Jai Balayya Song: జై బాల‌య్య సాంగ్‌పై Thaman వివ‌ర‌ణ‌తో ట్రోల‌ర్స్ షాక్‌

trollers adda

Jai Balayya Song: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన Veera Simha Reddy మూవీలో Jai Balayya Song ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. జై బాల‌య్య సాంగ్ వీర‌సింహారెడ్డి సినిమాకు హైలెట్‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్ని సాంగ్స్ బాగున్న‌ప్ప‌టికీ మాస్ రేంజ్‌లో ఊపు ఊపిన సాంగ్ మాత్రం జై బాల‌య్య సాంగ్ మాత్ర‌మే.

ఈ సాంగ్ విడుద‌లైన కొద్ది గంట‌ల‌కే బాల‌య్య అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాట‌ను షేర్ చేసి వారి మొబైల్ స్టేట‌స్‌ల‌లో అప్‌లోడ్ చేసుకుని బాల‌య్య‌పై అభిమానాన్ని చాటుకున్నారు. అప్ప‌ట్లో బాల‌కృష్ణ తీసిన స‌మ‌ర‌సింహా రెడ్డి, న‌ర‌సింహ నాయుడు, చెన్న‌కేశ‌వ రెడ్డి తో పాటు సింహా, లెజెండ్‌, అఖండ సినిమాల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ల‌ను అందుకున్న బాల‌య్య, ఇప్పుడు వీరసింహారెడ్డి తో సంక్రాంతికి బ‌రిలోకి దిగారు.

62 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్ప‌టికీ Balayya యాక్ష‌న్‌, డ్యాన్స్‌లో 25 ఏళ్ల కుర్రాడిని మైయ‌మ‌రిపించారు. తాత అయిన వ‌య‌స్సులో కూడా ఈ త‌రం కుర్ర‌కారు గుండెల్లో అభిమానం పెంచుకొని ఆరాధ్య లెజెండ్‌గా కొన‌సాగుతున్నారు. సాధార‌ణంగా బాల‌య్య సినిమాలు అంటేనే డైలాంగ్స్‌కు ప్రాణం ఉంటుంది. అదే విధంగా ఈ వీరసింహారెడ్డి సినిమాలో కూడా డైలాగ్స్‌తో అటు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొని, ఇటు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు ఆలోచ‌న లేపారు. జై బాల‌య్య సాంగ్‌ లో మాస్ యాక్ష‌న్‌లో క‌నిపించి బాల‌య్య సంక్రాంతికి అభిమానులను హుషారెకిత్తించారు.

ట్రోలింగ్‌కు గురైన Jai Balayya Song

పాట ఎంత సూప‌ర్ హిట్ అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట ట్రోలింగ్ కావ‌డం ఈ మ‌ధ్య మ‌నం చూస్తూనే ఉంటాం. అదే విధంగా జై బాల‌య్య సాంగ్ను కూడా సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు కొంద‌రు. ఈ సాంగ్ మ్యూజిక్ వింటుంటే విజ‌య‌శాంతి న‌టించిన ఒసేయ్‌ రాముల‌మ్మా సినిమా గుర్తుకు వ‌చ్చింద‌ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో వీర‌సింహారెడ్డి సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ SS Thaman కు ఈ విష‌యం చేరింది. దీంతో స్వ‌యంగా త‌మ‌న్ ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు.

నిజ‌మే ఒసేయ్ రాముల‌మ్మా osey Ramulamma, ట్యూన్ ని కాపీ చేశాం. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు నాకే కాదు ద‌ర్శ‌కుడు గోపికి, రైట‌ర్ రామ‌జోగ‌య్య శాస్త్రికి కూడా తెలుసు అని త‌మ‌న్ అన్నారు. వందేమాత‌రం శ్రీ‌నివాస్ గారి ఒసేయ్ రాముల‌మ్మ పాట‌కి నేనే వాయించా. ఈ పాట చేస్తున్న‌ప్పుడు ఒసేయ్ రాముల‌మ్మ తో పోలిక వ‌స్తుంద‌ని తెలుసు, తెలిసే చేశాం. ఇలాంటి క్రౌడ్ థీమ్ ఉన్న పాట‌లు దాదాపు ఒకే పిచ్‌లో ఉంటాయి అందుకే ఎక్క‌డో విన్న ఫీలింగే క‌లుగుతుంద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అన్నారు.

Jai Balayya Song
వీరసింహారెడ్డి మూవీలో బాల‌య్య‌

అయితే Taman వివ‌ర‌ణ‌కు కూడా నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా త‌మ‌న్ ఇదే మొద‌టి సారి అంటాడ‌ని, అంతా బాగా క‌వ‌ర్ చేశావు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు నీ లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్ Music Director, ఇలాంటి ప‌నులు చేస్తే నీకే సిగ్గు చేటు అంటున్నారు. సాంగ్ విడుద‌లైన‌ప్పుడు ఎందుకు చెప్ప‌లేదు త‌మ‌న్‌. ఇప్పుడు ట్రోల్స్ Trolls, ఎక్కువ అయ్యాయ‌ని చెబుతున్నావా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *