Jaggery Benefits: మీరు బెల్లం తింటున్నారా?

Jaggery Benefits: బెల్లం ఔష‌ధాల గ‌ని, పాత‌త‌రంలో బెల్లం వాడ‌కం బాగుండేది. బెల్ల‌ము తోనే ఎన్నో ర‌కాల తిండి ప‌దార్థాల‌ను వండేవారు. ఇప్పుడు ప్ర‌తిదానికీ పంచ‌దార వాడ‌టం వ‌ల్ల బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ప‌దార్థాన్ని కోల్పోతున్నాం. దానికి తోడు చ‌క్కెర వ‌ల్ల ప‌లు దుష్ప్ర‌ భావాలు పొడ‌చూపుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రం బెల్లంకు ప్రాధాన్యం ఇస్తుంది.

Jaggery Benefits: మీరు బెల్లం తింటున్నారా?

జీర్ణ‌శ‌క్తిని పెంపొందించే గుణం బెల్లానికి ఉంది. ప్ర‌తిరోజూ చిన్న బెల్లం ముక్క తిన‌డం మంచిది. జీర్ణ ప్ర‌క్రియ‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఎంజైమ్‌లు స‌మృద్ధిగా ఉత్ప‌త్తి అవుతాయి. క‌డుపులో గ‌డ‌బిడ త‌గ్గుతుంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య ర‌క్త‌హీన‌త‌. త‌ర‌చూ Bellam తీసుకునేవాళ్ల‌లో మాత్రం ఈ స‌మ‌స్య త‌క్కువ‌. బెల్లంలో ఇనుము అధికం. త‌ద్వారా హిమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది.

శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించుకునేందుకు ర‌క‌ర‌కాల ఆధునిక ప‌ద్ధ‌తులు వ‌చ్చాయి కానీ, ఖ‌ర్చు లేకుండా బెల్లంతోనే అది సాధ్యం అవుతుంది. కాలేయం ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే జ‌లుబు, ద‌గ్గు చుట్టుముడ‌తాయి. ఒక్కోసారి ముక్కునుంచి నీళ్లు కారుతూ మైగ్రేన్ కూడా వ‌స్తుంది. దీనికి చ‌క్క‌టి విరుగుడు బెల్లం. ప్ర‌తిరోజు కొంచెం బెల్లం తింటుంటే Fever రాదు. జింక్‌, సెలీనియ‌మ్ రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బెల్లంలో ఇవి పుష్క‌లం. బ‌రువు త‌గ్గ‌డానికీ బెల్లం ప‌నికొస్తుంది. కాబ‌ట్టి మీరు రోజు ఏదో ఒక రూపంలో కొంచెమైనా బెల్లం తీసుకుంటే మంచిది.

రోజూ బెల్లం తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒంట్లో వేడి త‌గ్గుతుంది. ఎన‌ర్జీ లెవ‌ల్స్ పెరుగుతాయి. పాల‌ల్లో క‌లిపి తాగితే ఎముక‌లు దృఢంగా మారుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. శిరోజాలు ప‌టిష్టంగా ఉంటాయి. ర‌క్త‌పోటు, గుండెజ‌బ్బులు ద‌రిచేర‌వు. బ‌రువు త‌గ్గుతారు. ఆహారం సాఫీగా జీర్ణం కావ‌డానికి, అనుకోకుండా శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు బెల్లం తిన‌డం వ‌ల్ల వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం త‌రువాత ఒక బెల్లం ముక్క తింటే అరుగుద‌ల‌కు డోకా ఉండ‌దు.

వ‌రి, మినుము లాంటి పంట‌ల నూర్పిడి, ధాన్యం సంచుల‌కు ఎత్త‌డం లాంటి స‌మ‌యాల్లో వాటికి సంబంధించిన దుమ్ము వెలువ‌డుతుంది. ఈ ప‌నులు చేసేవారి గొంతులోకి, శ్వాస‌నాళంలోకి, ఊపిరితిత్తుల్లోకి చేరిన తేలిక‌పాటి దుమ్ము వ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌కు బెల్లం ప‌రిష్కారంగా వాడ‌డం అనాదిగా వ‌స్తోంది. బెల్లం తిన‌డం వ‌ల్ల ఆహార నాళం, శ్వాస‌నాళం, ఊపిరితిత్తుల ప‌రిశుభ్ర‌మ‌వుతాయి. ఆహారం తీసుకోక నీర‌సించిన వ్య‌క్తి బెల్లం తింటే వెంట‌నే శ‌క్తి స‌మ‌కూరుతుంది.

మీకు తెలుసా?

Jaggery Benefits: తెల‌క‌పిండి, బెల్లం కొంచెంగా రోజూ వాడొచ్చు. వాటిలో పిల్ల‌ల‌కి కావాల్సిన ర‌క్ష‌క పోష‌క పదార్థాల్లూ, పిండి ప‌దార్థాలూ ఉంటాయి. వేరు శ‌న‌క మొద‌లైన‌వి త‌రుచుగా వాడాలి. ఎప్పుడూ పంచ‌దారే కాకుండా తాటిబెల్లం, అచ్చు బెల్లం కూడా త‌రుచూ వాడాలి. ఉత్స‌హానికి, ఉత్తేజానికి కొంచెం Honey వాడాలి. పంచ‌దార‌కు బ‌దులు పాల‌లో తేనె వాడ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కీ, పెద్ద‌ల‌కీ కూడా ఎక్కువ తీపి వాడ‌టం మంచిది కాదు. భోజ‌నానికి ముందు తీపి పెట్ట‌కూడ‌దు. భోజ‌న స‌మ‌యంలో తీపి ఎప్పుడూ పండు తిన‌డానికి ముందు తినాలి.

Share link

Leave a Comment