Jaggayyapeta Crime News

Jaggayyapeta Crime News | వ‌త్స‌వాయి : టిడిపి కార్య‌క‌ర్త వాహ‌నానికి నిప్పు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌


Jaggayyapeta Crime News : Jaggayyapeta: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం ఇందుగుప‌ల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రుడు ద్విచ‌క్ర వాహ‌నానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. బాధితుల వివ‌రాల ప్ర‌కారం..ఇందుగుప‌ల్లి గ్రామానికి చెందిన టిడిపి సానుభూతి ప‌రుడు హ‌రి మ‌ల్లు పొలంలో మిర్చి కాటా వేసేందుకు ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో త‌న ద్విచ‌క్ర‌వాహ‌నం రోడ్ మీద పార్క్ చేసి పొలంలోకి వెళ్లాడు. ఈ స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ద్విచ‌క్ర‌వాహ‌నంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌నం పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యింది. మంట‌లు రావాన్ని గ‌మ‌నించిన ప‌లువురు ఆర్పే ప్ర‌య‌త్నం చేయ‌గా ఫ‌లితం లేకుండా పోయింది. ద్విచ‌క్ర వాహ‌నంలో ప‌లు విలువైన ప‌త్రాలు అన్నీ మంట‌ల‌కు కాలి బూడ‌ద‌వ్వ‌డంతో బాధితుడు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యాడు.

ద‌గ్థ‌మైన ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ప‌రిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజగోపాల్ తాత‌య్య‌

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజ‌గోపాల్ తాత‌య్య‌

ఇందుగుప‌ల్లి గ్రామంలో మ‌ల్లు హ‌రి ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు త‌గ‌ల‌పెట్టిన విష‌యం తెలుసుక‌న్న జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజ్‌గోపాల్ తాత‌య్య హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన వాహ‌నాన్ని ప‌రిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన దుండ‌గుల‌ను పోలీసులు ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్టు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డింది ఇందుగుప‌ల్లి గ్రామానికి చెందిన వారేన‌ని బాధితుడు హ‌రి మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

మంట‌ల్లో ద‌గ్ధ‌‌వ‌వుతున్న ద్విచ‌క్ర‌వాహ‌నం (వీడియో)

ఇది చ‌ద‌వండి:దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం

ఇది చ‌ద‌వండి:చాప‌కింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!

ఇది చ‌ద‌వండి:పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం

ఇది చ‌ద‌వండి:బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స

ఇది చ‌ద‌వండి:రైతు గొప్ప‌త‌నాన్ని తెలిపిన శ్రీ‌కారం మూవీ సాంగ్ సూప‌ర్‌!

ఇది చ‌ద‌వండి:వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌!

ఇది చ‌ద‌వండి:బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన విలేక‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి:ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *