Ganesh Chaturthi

Ganesh Chaturthi: ‘మేము ఉత్స‌వాలు జ‌రుపుతాం’ అంటూ సీఎంకు లేఖ‌!

Spread the love

Ganesh Chaturthi: జగ్గయ్యపేట: విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజగోపాల్ (తాతయ్య) మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ‌లు పంపారు. జగ్గయ్యపేట పట్టణంలో నెట్టెం రఘురాం నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన అనేది లేకుండా పరిపాలన జరుగుతుందని విమ‌ర్శించారు. గణేష్ ఉత్సవాల(Ganesh Chaturthi)ను నిర్వహించుకోవడం అనేది నిషేధించడం తాము వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా అధికార పార్టీ స‌మావేశాలు ఏర్పాటు చేసుకోవ‌చ్చు..మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌చ్చా? అని వారు ప్ర‌శ్నించారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి యొక్క జయంతిని, వర్ధంతిని ఈ మధ్య జరపడం కూడా మనం చూశామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్సీపి శ్రేణులు ప్రతి గ్రామంలో కూడా ఆనంద ఉత్సాహాలతో DJ లతో ప్రకటిస్తూ అది ఒక సంబరంగా చేశారని తెలిపారు. ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో మత, కుల, ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు మీ మతతత్వాన్ని తెలుగుదేశానికి అంటగట్టే కుట్ర చేస్తున్నారని విమ‌ర్శించారు.

వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం సంస్కృతి, సాంప్రదాయంగా వస్తున్నది. దేశవ్యాప్తంగా జరుగుతున్నదని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఈ ఉత్సవాలను నిషేధించలేదని, ప్ర‌క్క‌న‌ తెలంగాణలో కూడా ఉత్స‌వాలు వైభ‌వంగా జ‌రిగేందుకు ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంద‌ని గుర్తుచేశారు.
ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నిషేధించడం దురుద్దేశపూరితం , సాంప్రదాయ విరుద్ధమ‌ని ఆరోపించారు.
ప్ర‌భుత్వం నిర్ణయం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయిని పేర్కొన్నారు.

కాబట్టి మీరు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చ‌రించారు. ప్రజాకాంక్ష మేరకు తెలుగుదేశం పార్టీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 10. 9. 2021 న విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాలలో వినాయక ఉత్సవాలు జరుపుతుందని ఈ సందర్భంగా లేఖ పంపిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేక వేంకటేశ్వర్లు, కన్నెబోయిన రామలక్ష్మి, కొఠారి సత్యనారాయణ ప్రసాద్, షేక్ ఖాసీం, దూలిపాళ్ళ లక్ష్మణ్ రావు, దొప్పలపుడి బ్రహ్మరావు తదితరులు పాల్గొన్నారు.

Water Pollution: Jaggayyapeta(Autonagar)లో క‌లుషిత నీరుతో అవ‌స్థ‌లు!

Water Pollution: Jaggayyapeta(Autonagar)లో క‌లుషిత నీరుతో అవ‌స్థ‌లు! Water Pollution: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణం ప‌రిధిలో ఉన్న ఆటోన‌గ‌ర్ ప్రాంతంలో సాయిన‌గ‌ర్‌లో క‌లుషిత నీరుతో స్థానికులు Read more

Jaggayyapeta Crime News | వ‌త్స‌వాయి : టిడిపి కార్య‌క‌ర్త వాహ‌నానికి నిప్పు!

Jaggayyapeta Crime News : Jaggayyapeta: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం ఇందుగుప‌ల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రుడు ద్విచ‌క్ర వాహ‌నానికి ఆదివారం Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.