Jagananna Vidya Deevena: పిల్ల‌ల గురించి కొత్త విష‌యాలు చెప్పిన సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

Andhra Pradesh
Share link

Jagananna Vidya Deevena: అమ‌రావ‌తి: ఈ ఏడాదికి సంబంధించి జ‌గ‌న‌న్న విద్యా దీవెన రెండో విడ‌త సొమ్మును ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మో హ‌న్ రెడ్డి గురువారం విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేశారు. దాదాపు 10.97 లోల మంది విద్యార్థుల‌కు రూ.693.81 కోట్ల‌ను విడుద‌ల చేశారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌న్న ల‌క్ష్యంతో దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తి విద్యార్థికి స‌కాలంలో బ‌కాయిలు లేకుండా పూర్తి ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఇస్తున్నారు.

విద్యాదీవెన రెండో విడత సొమ్ము విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. పిల్ల‌ల‌కు మ‌నం ఇచ్చే ఆస్తి చ‌దువేన‌ని అన్నారు. ప్ర‌తి అడుగులోను విద్యార్థ‌ల భ‌విష్య‌త్తు గురించి ఆలోచిస్తున్నా మ‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ బాగా చ‌దువుకోవాల‌నేది త‌న తాపత్ర‌యం అని, ఇందులో భాగంగానే జ‌గ‌న‌న్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena)అనే మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కార చుట్టామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. త‌ల్లిదండ్రుల‌కు భారం లేకుండా విద్యాదీవెన అమ‌లు చేస్తున్నామ‌న్నారు. దేవుడి ఆశీస్సుల‌తోనే ఇదంతా చేయ‌గ‌ల్గుతున్నామ‌న్నారు.

ప్ర‌తి పేద విద్యార్థికి అందుబాటులో చ‌దువు

ప్ర‌తి పేద విద్యార్థికి చ‌దువు అందుబాటులో రావాల‌న్న‌దే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని అన్నారు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం మ‌న ద‌గ్గ‌ర 33 శాతం నిరక్ష‌రాస్య‌త ఉంద‌న్నారు. బ్రిక్స్ దేశాల‌తో పోలీస్తే మ‌న దేశంలో ఇంట‌ర్ త‌ర్వాత డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువుగా ఉంద‌న్నారు. ఈ ప‌రిస్థితిని మార్చ‌డం కోసం అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. త‌ల్లిదండ్రుల‌కు భారం లేకుండా వ‌స‌తి దీవెన అందిస్తున్నామ‌న్నారు.

ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి త‌ల్లుల ఖాతాల్లోనే డ‌బ్బు జ‌మ చేస్తున్నామన్నారు. త‌ల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. విద్యా దీవెన‌తో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.5,573 కోట్లు అందించామ‌న్నారు. అమ్మఒడి, విద్యాకానుక‌, మ‌న బ‌డి నాడు – నేడు కింద మొత్తం రూ.26,677 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. విద్యాదీవెన రెండో విడుత సొమ్ము విడుద‌ల కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌తి త‌ల్లి క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌న్నారు. విద్యాదీవెన మొద‌టి విడ‌త ఏప్రిల్ లో, రెండో విడ‌త ఇవాళ‌, మూడో విడ‌త డిసెంబ‌ర్‌లో, నాల్గో విడ‌త ఫిబ్ర‌వ‌రిలో చెల్లిస్తున్నామ‌న్నారు.

విద్యారంగంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చేసిన ఖ‌ర్చు ఈ రెండు సంవ‌త్స‌రాల కాలంలోనే జ‌గ‌న‌న్న అమ్మఒడి రూ.44,48,865 మంది త‌ల్లుల‌కు రూ.13,022 కోట్లు జ‌మ చేశామ‌న్నారు. విద్యా దీవెన ద్వారా 18,80,934 మందికి రూ.5,573 కోట్లు, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ద్వారా 15,56,956 మందికి రూ.2.270 కోట్లు,
జ‌గ‌న‌న్న గోరుముద్ధ ద్వారా 36,88, 618 మందికి రూ.1600 కోట్లు, జ‌గ‌నన్న విద్యాకానుక ద్వారా 47,00, 000 మందికి రూ.647 కోట్లు, మ‌న‌బ‌డి నాడు – నేడు కింద తొలిద‌శ‌లో రూ.3,564 మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసం ఖ‌ర్చ చేశామ‌న్నారు.

See also  Rain Alert: రాగ‌ల 24 గంట‌ల్లో ఉరుముల‌తో కూడిన భారీ వ‌ర్షాలు

Leave a Reply

Your email address will not be published.