Jagananna Mosam: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజుకో కొత్త విధానంతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఏదో ఒక సమస్యను ప్రజల వద్దకు తీసుకెళుతూ రాజకీయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏపీలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఉండగానే జగనన్న మోసం పేరుతో ఓ HashTag ను పవన్ కళ్యాణ్ బయటకు విడుదల చేశారు.
Jagananna Mosam: జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు
ఏపీలో పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ ఆరోపించారు. జనసేన చేపట్టిన సామాజిక పరిశీలన కార్యక్రమంలో జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు అని తేలిందని పవన్ పేర్కొన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయాలని జనసేన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ నెల 13 అనగా రేపు విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలించనున్నారు. జగన్ చేపట్టిన కార్యక్ర మంలో భాగంగా సీఎం శంకుస్థాపన చేసి, పైలాన్ ఆవిష్కరించిన గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, పథకం అమలు తీరును లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకోనున్నారు.

జగనన్న ఇళ్లపై జనసేన సోషల్ ఆడిట్ అనే కార్యక్రమంపై మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా Jagananna Mosam కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల కాలనీలు, టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను జనసేన నేతలు పరిశీలించ నున్నారు. అయితే పవన్ విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జగనన్న ఇళ్ల సోషల్ ఆడిట్లో పాల్గొననున్నారు.