Driving Licence : ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ చేసేవారి సంఖ్య పెరిగింది. ఇదే సందర్భంలో రోడ్డు ప్రమాదాలూ పెరిగాయి. వాహనం నడిపేటప్పుటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి అనుమతి లేకుండా డ్రైవింగ్ చేయడం లాంటి అస్పష్టమైన భద్రతతో వాహన చోదకులు బళ్లు నడుపుతున్నారు.
Driving Licence : ట్యాంకులో పెట్రోలుంది కాదా! అని మోటార్ సైకిలో, స్కూటరో ఎక్కి రోడ్డు మీద రయ్‌మంటూ ఇష్టానుసారంగా చక్కర్లు కొట్టాలనుకుంటే కుదరదండోయ్! రోడ్డుమీద బండి నడపాలంటే కొన్ని డాక్యు మెంట్లు(documents) తప్పనిసరిగా వెంట ఉండాల్సిందే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులకో, రవానా అధికారులకో జరిమానా(fine) చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి వాహనం సీజ్ చేసినా చేస్తారు కూడా. అందుకే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కింది వాటిని వెంట ఉంచుకోండి.
డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence )..
మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనం నడపడానికి లైసెన్సు తప్పనిసరి. అది లేకుండా వాహనం నడిపితే పోలీసులు రూ.500 నుంచి రూ.1500 వరకూ జరిమానా విధించవచ్చు. లైసెన్సు లేకుండా నడిపిన వ్యక్తికి రూ.500, లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చినందుకు వాహన యజమానికి రూ.1000 జరిమానా విధించవచ్చు.

‘ఎల్’ బోర్డు( L board) ఉండే..
లెర్నింగ్ లైసెన్సు ఉంది కదా అని వాహనానికి ఎల్ బోర్డు తగిలించి, సింగిల్‌గా బండి నడిపితే కుదరదు. వెనుక పర్మినెంట్ లైసెన్స్(Permanent licence) ఉన్న వ్యక్తి ఉండి తీరాల్సిందే. లేకుంటే లెర్నింగ్ లైసెన్స్ ఉన్నా, లైసెన్స్ లేనట్టుగా పరిగణించి జరిమానా వేయవచ్చు.
ఇన్సూరెన్స్(Insurance)
ప్రస్తుత కాలంలో వాహనానికి ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి అయ్యింది. ఇది లేకుండా బండి నడిపితే రూ.1000 వరకూ జరిమానా తప్పదు. ఇన్సూరెన్స్‌కు కాలపరిమితి ముగిసినా ఫైన్ విధిస్తారు.
ఆర్సీ(RC Book)
బండి నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) ఉండి తీరాలి. ఇది లేకుండా బండి నడిపితే రూ.100 నుంచి రూ.200 వరకు ఫైన్ వేస్తారు. పోలీసులకు అనుమానం వస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు కూడా. మళ్లీ ఒరిజనల్ ఆర్సీ తీసుకెళ్లి చూపిస్తేనే బండిని అప్పగిస్తారు.

పొల్యూషన్ సర్టిఫికెట్(Pollution Certificate)
వాహనం నుంచి కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి విడుదల కాకూడదు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకుని కూడా ఉంచుకోవడం తప్పనిసరి. ఇది లేకుండా వాహనం నడిపితే రూ.1000 ఫైన్ వేస్తారు.
హెల్మెట్ (Helmet)
ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్((Helmet) తప్పనిసరిగా ధరించాలి. ఊహించని విధంగా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిరస్సుకు హెల్మెట్ రక్షణనిస్తుంది. హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరైంది.
Note: నిబంధనల ప్రకారం జిరాక్స్ పేపర్లు చెల్లవు. బండి నడిపే సమయంలో ఒరిజనల్ డాక్యుమెంట్లు
తప్పని సరిగా ఉండాలి. ఈ నిబంధనలన్నీ మన రక్షణ కోసమేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వీటిని తప్పనిసరిగా పాటించాలి.

హెల్మెట్ వద్దంటే ఎలా?
నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో అంతటా వేగమే. ఈ వేగమే ప్రమాదాలకు కారణమవుతూ వాహన చోదకులను మృత్యుమార్గంలోకి నెడుతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపేవారు వేగం తప్ప భద్రతను పాటించక పోవడంతో లేనిపోని ప్రమాదాలను తేలికగా కొని తెచ్చుకుంటున్నారు. అతి వేగం, నిర్లక్ష్యంతో కొన్ని సార్లు ప్రాణాలనే కోల్పోతున్నారు. గతంలో ఇంటికో సైకిల్(cycle) ఉండేది. నేడు ఆ స్థానాన్ని ద్విచక్ర వాహనాలు ఆక్రమించాయి. తల్లిదండ్రులు కూడా తమ కుర్రాడు కాలేజీలో చేరితే చాలు బైక్‌లు కొని ఇస్తున్నారు. యువత వాహనాన్ని ఎక్కితే చాలు పరిసరాలను మరిచిపోతూ వేగాన్ని నిరోధించుకోలేక పోతున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అనువైన రోడ్లు, కూడలి ప్రాంతాల్లో సూచికల్లేని మూల మలుపుల్లో వేగాన్ని తగ్గించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పల్లెలు – పట్టణాలనే తేడా లేకుండా!
వాహనం నడిపేవారు పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని చోట్లా రహదారులు అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం, అక్రమంగా లైసెన్స్‌లు పొందడం, తనిఖీలు లేకపోవడం వల్ల కూడా వాహన చోధకులు ప్రమాదాలకు పాల్పడు తున్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని వాహనాల తయారీదారులు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు చెబుతున్నా పట్టించుకోక పోవడంతో ఏటా భారత్‌లో ద్విచక్రవాహనదారులే 40,000 మంది మరణిస్తున్నారని, మరో 1,00,000 మంది తీవ్రంగా గాయపడుతున్నారు.

కార్ల ప్రమాదాల్లో కంటే ద్విచక్రవాహన దారులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు 66 రెట్లు ఎక్కువ అని కూడా తాజా సర్వేలో తేలింది. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరిస్తే 42 శాతం ప్రమాదాల్లో ప్రాణాలు దక్కించుకోవచ్చని, 69 శాతం ప్రమాద సందర్భాల్లో గాయపడకుండా బయటపడొచ్చని కూడా యూఎన్ మోటార్ సైకిల్ హెల్మెట్ స్టడీ(Un Motorcycle helment study) నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో40 లక్షల మంది మరణిస్తు న్నారు. అందులో 16 లక్షల మంది హెల్మెట్ ధరించి ఉంటే తమ ప్రాణాలను కాపాడుకునేవారు. మోటారు వాహనాల ప్రమాదాలు పరిశీలిస్తే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలోనే ఉంది.
కోపంతో కారు డ్రైవ్ (Car Driving)చేస్తే అంతే సంగతి!
కారు నడిపేవాళ్లు కోపంగా ఉన్నా, విషాదంగా ఉన్నా ఏడుస్తున్నా, ఉద్వేగంతో ఉన్నా, రోడ్డు మీద నుంచి తమ చూపు మరల్చినా యాక్సిడెంట్ రిస్కు 10 రెట్లు ఎక్కువుగా ఉంటుందట. ఇటీవల జరిపిన ఒక అధ్యాయనంలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు ఇతర పనుల్లో నిమగ్నమైన ఉన్నా, అంటే కారు నడుపుతూ సెల్‌ఫోన్ లో మాట్లాడటం, రోడ్డు మీద ఉన్న బోర్డులను చదవడం, రోడ్ మీద వెళ్లే వారి వైపు చూడ్డం వంటి వాటి వల్ల కూడా వారి చూపు రోడ్డు మీద సరిగా ఉండదు. ఈ తరహా డ్రైవర్లు 50 శాతం సమయంలో డ్రైవింగ్ లో ఉండటం ఆందోళన కలిగించే విషయం. అమెరికాలో వర్జీనియా టెక్ యూనివర్శిటీకి చెందిన అధ్యాయన కారులు ఈ స్టడీని నిర్వహించారు. ఇందులో 90% యాక్సిడెంట్లు అలసట వల్ల, ఏకాగ్రత లోపించడం వల్ల జరుగుతున్నాయట. అధ్యాయనంలో భాగంగా 1600 వరకూ సాధారణ స్థాయి యాక్సిడెంట్ల నుంచి తీవ్రమైన యాక్సిడెంట్లను స్టడీలో పరిశీలించారు. వీటిల్లో 905 పెద్ద యాక్సి డెంట్ల వల్ల బళ్లను నడిపేవారికి, ఇతరులకు తీవ్ర గాయాలు అయితే, కొన్ని సందర్భాల్లో బాగా ఆస్తినష్టం కూడా జరిగిందట.

అయితే చాలా యాక్సిడెంట్లు బండి నడిపేవాళ్ల తప్పిదనం వల్లే జరగుతున్నాయట. వెహికల్ రియర్ సీటు నుంచి చిన్న పిల్లలతో మాట్లాడటం వల్ల కొంత వరకూ రక్షణ ఉంటుందని, రిస్కు తక్కువుగా ఉంటుందని కూడా అధ్యయన కారులు అంటున్నారు. డ్రైవింగ్‌లో డిస్ట్రాక్టింగ్ ను నియంత్రించకపోతే భవిష్యుత్తులో ఇలాంటి ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందటున్నారు. అందుకే బళ్లు నడిపే వాళ్లు ఏకాగ్రతతో పనిచేయాలి. ప్రతి క్షణం రోడ్డును జాగ్రత్తగా గమనించుకుంటుండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి