PSLV

ISRO’s PSLV-C51 launch: పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం

Spread the love

ISRO’s PSLV-C51 launch: Sriharikota : భార‌త అంత‌రిక్ష ప‌రిశోద‌న సంస్థ (ఇస్రో) శాస్త్ర‌వేత్త‌ల చేసిన కృషి ఫ‌లించింది. నెల్లూరు జిల్లా శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీశ్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్ నుంచి చేప‌ట్టిన పీఎస్ఎల్‌వీ సి – 51 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. దేశీయ‌, ప్రైవేటు సంస్థ‌ల‌కు చెందిన 19 ఉప‌గ్రహాల‌ను విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు ఇస్రో ఛైర్మ‌న్ శివ‌న్ ప్ర‌క‌టించారు. ఆదివాయం ఉద‌యం స‌రిగ్గా 10.24 గంట‌ల‌కు ధ్రువ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ వాహ‌క‌నౌక – సి-51 (పీఎస్ఎల్ వీ) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో చేప‌ట్టిన మొద‌టి ప్ర‌యోగం ఇదే మొట్ట‌మొద‌టిది. ఈ మొద‌టి ప్ర‌యోగ వేదిక నుంచి 29వ ప్ర‌యోగంగా న‌మోదైంది.

పీఎస్ఎల్ వీ – డీఎల్ వ‌ర్ష‌న్‌లో మూడోది. ప్ర‌యోగం నేప‌థ్యంలో షార్‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రి మార్కోస్ క్వాంట‌స్ షార్ కు చేరుకుని ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. పీఎస్ఎల్ వీ – సి-51 వాహ‌న‌నౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా -1 ఉప‌గ్ర‌హాన్ని క‌క్ష్య‌లోకి పంపారు. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఘ‌న‌మైన సేవ‌లు అందిస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్‌

అనేక సంవ‌త్స‌రాలుగా భార‌త్ అంతరిక్ష ప‌రిశోద‌న సంస్థ ఇస్రోకు న‌మ్మిన‌బంటులా ఘ‌న‌మైన సేవ‌లు అందిస్తున్న పీఎస్ఎల్ వీ రాకెట్ మ‌రోసారి త‌న‌కున్న గుర్తింపును సార్థ‌కం చేసుకుంది. ఆదివారం ఉద‌యం 10.24 గంట‌ల‌కు శ్రీ‌హ‌రికోట రాకెట్ ప్ర‌యోగం కేంద్రం నుంచి నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ – 51 వాహ‌న నౌక అనుకున్న ప‌ని పూర్తి చేసింది. అనుకున్న స‌మ‌యానికి రోద‌సిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ 19 ఉప‌గ్ర‌హాల‌ను నిర్ధేశిత క‌క్ష్య‌ల్లో ప్ర‌వేశ‌పెట్టింది.
అన్ని ద‌శ‌ల్లోనూ రాకెట్ ప‌నితీరు స‌వ్యంగానే ఉంద‌ని, బూస్ట‌ర్లు, ఉప‌గ్ర‌హాలు స‌జావుగా విడివ‌డ్డాయ‌ని ఇస్రో ఛైర్మ‌న్ కె.శివ‌న్ ప్ర‌క‌టించారు. కాగా, ఈ సారి ప్ర‌యోగానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. బ్రెజిల్ శాస్త్ర‌సాంకేతిక శాఖ మంత్రి మార్క‌స్ క్వాంట‌స్ ఈ ప్ర‌యోగాన్ని వీక్షించేందుకు శ్రీ‌హ‌రికోట వ‌చ్చారు. విదేశీ అతిథి స‌మ‌క్షంలో పీఎస్ఎల్వీ సీ -51 ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా చేప‌ట్టిన ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు సంబురాలు చేసుకున్నారు.

శ్రీ‌హ‌రికోటలో రాకెట్ ప్ర‌యోగం (సేక‌ర‌ణ: ట్విట్ట‌ర్ )

బ్రెజిల్ బృందానికి అభినంద‌లు ఇస్రో ఛైర్మ‌న్‌

ఈ సారి పీఎస్ ఎల్వీ రాకెట్ మోసుకెళ్లిన ఉప‌గ్ర‌హాల్లో బ్రెజిల్ కు చెందిన అమెజానికాయ – 1కూడా ఉంది. దీనిపై ఇస్రో ఛైర్మ‌న్ శివ‌న్ మాట్లాడుతూ.. బ్రెజిల్ బృందానికి ముందుగా అభినందన‌లు తెలిపారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేప‌ట్టిన మొద‌టి ప్ర‌యోగం స‌ఫ‌లం కావ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు. సీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 53వ రాకెట్ ప్ర‌యోగం కాగా, శ్రీ‌హ‌రి కోట నుంచి జ‌రిగిన 75వ ప్ర‌యోగం. ఇక భార‌త్ కు చెందిన ఓ ఉప‌గ్ర‌హం ద్వారా అంత‌రిక్షంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరు, ఫొటో, అత్మ‌నిర్భ‌ర్ భార‌త్ మిష‌న్ పేరు, భ‌గద్గీత‌, 25 వేల మంది పేర్ల‌ను పంపారు. ఈ పేర్ల‌లో 1000 మంది విదేశీయుల‌తోపాటు చెన్నై విద్యార్థులు పేర్లు కూడా ఉన్నాయ‌ని ఇస్రో బృందం తెలిపింది.

ఇది చ‌ద‌వండి:బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స

ఇది చ‌ద‌వండి:రైతు గొప్ప‌త‌నాన్ని తెలిపిన శ్రీ‌కారం మూవీ సాంగ్ సూప‌ర్‌!

ఇది చ‌ద‌వండి:వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌!

ఇది చ‌ద‌వండి:బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన విలేక‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి:ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

amazing facts for students:ఔరా! అనే కొన్ని వింత విశేషాలు గురించి తెలుసుకోండి!

amazing facts for studentsఈ ప్ర‌ప‌చంలో ప్ర‌తిదీ వింత‌గానే క‌నిపిస్తుంది. మాన‌వుని జీవితం ద‌గ్గ‌ర నుంచి చిన్నక్రిమి కీట‌కం వ‌ర‌కు జీవ‌న శైలి వైరుఢ్య భ‌రితంగా ఉంటుంది. Read more

Jeff Bezos Blue Origin Completes 11 min Space Trip

Jeff Bezos: We had recently released a video about Richard Branson's Virgin Galactic that launched a spaceflight with the aim Read more

Business News India: ఇండియా బిజినెస్ వార్త‌ల‌ను చ‌ద‌వండి

Business News India | శుక్ర‌వారానికి సంబంధించిన బిజినెస్ తాజా వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా ఆదానీ ప‌వ‌ర్ స్టాక్ విలువ‌, ఇన్సూరెన్స్ కొత్త Read more

News Crime: క్రైమ్ న్యూస్ లెటెస్ట్ అప్డేట్స్ శుక్ర‌వారం 22,2022

News Crime | ఈ రోజు క్రైమ్ వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధాన అంశాల‌లో భాగంగా తెలంగాణ‌లో యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది, గ్యాంగ్ రేప్ Read more

Leave a Comment

Your email address will not be published.