omicron dangerous: ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌రం కాదులే అనే వారికి ఈ స‌ల‌హా!

omicron dangerous హైద‌రాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ తేలిక‌పాటిదేన‌ని, ప్ర‌మాద‌క‌రం కాద‌ని, ఈ వైర‌స్ సోకినా పెద్ద‌గా ఇన్ఫెక్ష‌న్లు లేనందున భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ఆందోళ‌న క‌లిగించే విధంగా ఉంద‌ని అపోలో గ్రూప్ హాస్పిట‌ల్స్ ప్రెసిడెంట్ కె.హ‌రిప్ర‌సాద్ అన్నారు.

ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్రచారం!

ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌మాద‌క‌ర‌రీతిలో ఉంద‌ని కె.హ‌రిప్ర‌సాద్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏ వేరియంట్(omicron dangerous) అయినా ప్ర‌జ‌లు జాగ్రత్త‌లు పాటిస్తేనే వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై జ‌రుగుతున్న వివిధ ర‌కాల ప్ర‌చారం నేప‌థ్యంలో ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో ఒమిక్రాన్‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిచేశారు.

మునుప‌టి కంటే వ్యాప్తి వేగం ఎక్కువే!

క‌రోనా-19 లో ప్ర‌స్తుతం వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మునుప‌టి వేరియంట్ల‌తో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి రోగ‌నిరోధ‌క వ‌క్తి ఉన్న వ్య‌క్తిలోకి ఈ వైర‌స్ ప్ర‌వేశిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. కానీ ఆ వ్య‌క్తి నుంచి ఇత‌రుల‌కు ఈ వైర‌స్ వేగంగా సోకుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ తేలిక‌పాటి ల‌క్ష‌ణాల‌ను క‌లిగిస్తున్న‌ట్టు గుర్తిస్తున్నామ‌న్నారు.

ఇది సోకిన ప్ర‌జ‌లు దానిని ఒక చిన్న‌పాటి జ‌లుబుగా భావిస్తున్నారు. వాస్త‌వానికి ఒమిక్రాన్ కార‌ణంగా కోవిడ్ ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చింది అని తెలియ‌క‌పోతే, వారు సాధార‌ణ వ్య‌క్తుల్లాగే బ‌య‌ట స‌మాజంలో తిరుగుతారు. త‌ద్వారా అనే మంది ఇత‌ర వ్య‌క్తుల‌కు ఇన్ఫెక్ష‌న్ సోకే ప‌రిస్తితి ఏర్ప‌డుతుంది.

omicron virus

అంచ‌నా త‌క్కువ వేయ‌వ‌ద్దు!

ఒమిక్రాన్ తీవ్ర‌మైన దుష్ఫ్ర‌భావాల‌ను క‌లిగించే గుణం క‌ల‌దు. మ‌ర‌ణాల‌కు దారితీయ‌ద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా సాధార‌ణంగా మారుతోంది. ప్ర‌స్తుతం ఈ వైర‌స్ చాలా త‌క్కువ స్థాయిలో ఉన్నా ఆస్ప‌త్రిలో చేరాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. కొంద‌రికి ఐసీయూ సంర‌క్ష‌ణ కూడా అవ‌స‌ర‌మ‌వుతోంది. ఇత‌ర దేశాల్లో మ‌ర‌ణాలు కూడా సంభ‌వించిస్తున్న‌ట్టు తెలుస్తోంది. డెల్టా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అంద‌రికీ తెలుసు.

రెండ‌వ ద‌శ‌లో ఆ వేరియంట్ మ‌న‌కు భ‌యంక‌ర‌మైన అనుభావాన్ని మిగిల్చింది. ఇప్ప‌టికీ కోవిడ్ వ్యాప్తి కొన‌సాగుతోంది. మున్ముందు ఇది భారీ న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించాలి. వ్య‌క్తులుగా మ‌న బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి. పౌరులుగా ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవడానికి, అది క‌లిగించే న‌ష్టాన్ని వీలైనంత‌గా త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి.

ఒమిక్రాన్ జాగ్ర‌త‌లు!

ప్ర‌తి ఒక్క‌రూ ముఖానికి మాస్క్ ను స‌రైన ప‌ద్ధతిలో ధ‌రించాలి. గుంపులుగా గుమ్మిగూడ‌కుండా ఎక్కువ మంది పాల్గ‌నే స‌మావేశాల‌కు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. త‌క్కువ లక్ష‌ణాలు క‌నిపించినా వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాలి. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ముందుస్తుగానే వైద్య స‌హాయం తీసుకోవాలి. హోమ్ ఐసోలేష‌న్ పాటించాలి. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇమ్యునైజేష‌న్ డోస్‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

Share link

Leave a Comment