Iron Hemoglobin: ఐర‌న్‌కు హీమోగ్లోబిన్‌కు సంబంధం ఏమిటంటే?

Iron Hemoglobin: మ‌న శ‌రీరంలోని ర‌క్తం ఎర్ర‌గా ఉంటుంది క‌దా! ఆ ఎరుపు రంగు రావ‌డానికి కార‌ణం హీమోగ్లోబిన్‌, హీమోగ్లోబిన్‌కు మూలాధారం ఇనుము. ప్రాణ వాయువును క‌ణాల‌కు చేర‌వేయ‌డానికి హీమోగ్లోబిన్(Hemoglobin) యొక్క ప‌ని. మ‌రొక విధంగా చెప్పాలంటే క‌ణాల‌కు ప్రాణ వాయువును అందించే ప్ర‌ధాన మూల‌కం ఇనుము అన్న మాట‌. ఇనుము నిర్వ‌ర్తించే ధ‌ర్మం ప్ర‌ధానంగా ఇదే. అందువ‌ల్ల‌నే మ‌న ర‌క్తంలో ఇనుము త‌గ్గితే రక్త‌హీన‌త వ‌స్తుంది. దీనితో గుండెద‌డ‌, అల‌స‌ట క‌లుగుతుంది. ఒక్క ర‌క్తం(blood) మిన‌హాయించి ఇత‌ర శరీర భాగాల‌లో ఇనుము(Iron) ఎక్కువుగా ఉండ‌దు. అయినా మ‌నం జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును స్వీక‌రించి దేహానికంత‌టికీ స‌ర‌ఫ‌రా చేస్తుంది. క‌నుక‌నే ఇనుము అత్యంత విలువై ఖ‌నిజ ల‌వ‌ణంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది.

human body

హోమియోప‌తి వైద్య శాస్త్రంలో ఫెర్రంమెట్‌, ద్వాద‌శ ల‌వ‌ణ చికిత్స‌లో ఫెర్రం ఫాస్ అనే ఔష‌ధం ఇనుమే. ఆకు కూర‌ల‌లో ఇనుము పుష్క‌లంగా ఉంటుంది. కాయ‌గూర‌లు, పండ్లు, ప‌ప్పు ప‌దార్థాల‌లో కూడా ఇనుము ఉంటుంది. రాగులు, స‌జ్జ‌ల‌లో ఇనుము అధికం. అందువ‌ల్ల‌నే రాగులు జావ‌, స‌జ్జ రొట్టెలు అల‌వాటు చేసుకుంటే ఇనుము కొర‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

Share link

Leave a Comment