Iron Cot | ఈ ఫొటో చూశారా? ఎవరో ఈ మంచాన్ని అమాంతం ఎత్తుకెళ్లి చక్కగా అక్కడ పెట్టినట్టు ఉంది కదూ. ఇంకా చెప్పాలంటే సర్కస్ వారు ఏదో చేయడానికి దానిని అక్కడ పెట్టినట్టు ఉంది కదూ. అయితే ఎవరూ ఈ మంచంను అక్కడ పెట్టలేదండోయ్. మరి అక్కడకు ఎలా చేరింది. గాల్లో తేలినట్టుందే…అన్నట్టు మంచం అక్కడ ఎలా చిక్కుకుంది. నేలపైన ఉండాల్సిన మంచం ఆకాశానికి భూమికి మధ్య ఈ విధంగా ఎలా వేలాడుతోంది.
ఈ మంచం(Iron Cot) తీగలపై ఎలా వేలాడుతుందంటే గత కొద్ది రోజులుగా వడగాలులు, వాతావరణంలో మార్పులు, వర్షాలు పడటం జరుగుతున్నాయిగా. అదే విధంగా పెద్ద గాలి(AIR) రావడంతో నేలపైన ఉన్న ఇనుప మంచం ఒక్కసారిగా అమాంతం విద్యుత్ తీగల మీదకు వెళ్లి అలా నిలిచింది. మనం సాధారణంగా ఇళ్ల మధ్య ఏదైనా కాగితమో, కవరో ఎగురి చెట్లపైన, తీగలపైనా ఇలా ఇరుక్కుపోవడం గమనించి ఉంటాం. కానీ ఏకంగా ఒక మనిషి పడుకునే మంచం గాలిలోకి ఎగిరి తీగలపైన వేలాడుతుందంటే ఇక గాలి ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఈ దృశ్యం Nellore జిల్లా ఉదయగిరి bc కాలనీలో కనిపించింది. విపరీతమైన గాలులు వీయడంతో నేలపై ఉన్న మంచం ఈదురు గాలులకు అమాంతం లేచి కరెంటు తీగలపై వేలాడుతుంది. దీనిని చూసిన ఓ వ్యక్తి వెంటనే తన ఫోన్ ద్వారా క్లిక్ మనిపించాడు. మంచం ఒక్కసారిగా current తీగలపై కనిపించడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా నయం మంచం మీద మనిషి ఉంటే మనిషితో సహా లేచి పోయేవాడేనేమో అంటూ నవ్వుకుంటున్నారు స్థానికులు.