IRDA: list of Insurance Companies in India In Telugu | దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని అంటే?
ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy) చేపించుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance Policy) అనేది కొంత మందికి అవగాహన ఉన్నప్పటికీ, వారు ఉన్న పరిస్థితుల్లోనూ, సమయంలోనూ దానిని చాలా ఈజీగా తీసుకుంటారు. బహుశా మీరుప్పుడైనా..ఏదైనా పనిలో ఉన్నప్పుడైనా, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా, ఏ ప్రదేశంలోనైనా ”సార్ ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy) ఉందా? అయితే మా దగ్గర మంచి పాలసీలు ఉన్నాయి. మీకు, మీ కుటుంబానికి భద్రత కల్పించే గొప్ప పాలసీలు ఉన్నాయి. కాస్త సమయం ఇస్తే మీకు వివరిస్తాను, లేదా మీ నెంబర్ ఇవ్వండి. మిమ్మల్ని ఎక్కడ కలవాలో కాస్త చెపితే నేనే స్వయంగా వచ్చి కలుస్తాను..సార్!” అంటూ వినయంగా ఒక బ్యాగు వేసుకొని రోడ్లపైన చెప్పులు అరిగేలా తిరిగే ఇన్సూరెన్స్ ఏజెంట్లు దేశంలోని, ప్రపంచంలోని లక్షల సంఖ్యలో ఉన్నారు. వాస్తవంగా వారికి ఆ కంపెనీ ఇచ్చే ఎంతో కొంతో కమీషన్ ప్రక్కన పెడితే, వారు మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించే గొప్ప అవకాశాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ(Life Insurance Policy)ల ద్వారా అందిస్తున్నారు.
ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత మరణించడం సహజమైన విషయమే. కానీ ఈ మధ్యలో ఉన్న జీవిత కాలం మాత్రం చాలా విలువైనది. ఒక వ్యక్తి ఒక కుటుంబంగా, ఒక తరంగా మారడానికి ఎన్నో శ్రమలను, ఆటు పోటులను, కష్టాలను,నష్టాలను ఎదుర్కొని గానీ గొప్ప జీవితమనే విజయాన్ని సాధించలేడు. ఎన్ని లక్షలు, కోట్లు ఉన్నా, అసలు చేతిలో డబ్బులు మిగలని సగటు మనిషి అయినా ప్రతి ఒక్కరికీ, వారి కుటుంబానికి ప్రస్తుతం ఉన్న కాలంలో ఇన్సూరెన్స్(Insurance Policy) తప్పక అవసరం.
ఎందుకంటే ఇన్సూరెన్స్‌లో ఆ వ్యక్తి దాచుకునే డబ్బులు అప్పటికప్పుడు లాభాన్ని చేకూర్చనప్పటికీ భవిష్యత్‌ను మాత్రం ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు మొదటి స్థానంలో ఉన్నాయనేది మాత్రం నమ్మలేని నిజం. మనం తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల మనకు, మన కుటుంబానికి ఎంతో మేలు చేస్తాయి. మనం ఒక వేళ దురదృష్టవ శాత్తు మరణించినా తదనంతరం మన పిల్లలు, భార్య, తల్లిదండ్రులకు ఏ లోటూ రాకుండా, అనాథలు కాకుండా చూసే భద్రత లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తుంది.
కాబట్టి వీలైనంత త్వరగా మీకు, లేకుంటే మీ కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ తప్పక చేపించుకోండి. రోజు మొత్తంలో ఒక వ్యక్తి సంపాదన రూ.100 అనుకున్నప్పటికీ, ఆ రూ.100 లలో రూ.10 ప్రక్కన తీసి ఇన్సూరెన్స్ పాలసీకి ఉపయోగించండి. ఆ రూ.10 కాస్త, వేలల్లో నుండి లక్షల్లోకి వెళ్లి మీకు, మీ కుటుంబానికి భరోసా కల్పిస్తుంది. ముఖ్య విషయం ఏమిటంటే దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ(Insurance Policy Companies)లు పుట్టగొడుగుల్లా ఉద్భవించాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎన్నో కొత్త కంపెనీలు కూడా ప్రజల వద్దకు వచ్చాయి. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ముఖ్యంగా భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐఆర్డిఏ (Insurance Regulatory and Development Authority-IRDA)లో గుర్తింపు పొంది ఉన్నదా? లేదా? అనేది గమనించండి.


ఐఆర్‌డిఎ(IRDA)లో గుర్తింపు పొందిన ఇన్సూరెన్స్ కంపెనీలు 99 శాతం మనకు, మనం తీసుకునే పాలసీకి నిబంధనలను కచ్ఛితంగా అమలు చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నాణ్యమైన, నమ్మకమైన ఇన్సూరెన్స్ పాలసీల కంపెనీలను ఎంచుకోండి. ముందు ఆ పాలసీల ఏజెంట్లు చెప్పే వాటిలో ఎంత ప్రయోజనం ఉందో తెలుసుకోండి. ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉదాహరణకు రూ.10 సంవత్సరానికి కట్టి పాలసీ తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత రూ.5లక్షలు ఇన్సూరెన్స్, బీమా వస్తుందని చెబితే కాస్త ఆలోచించండి. అసలు భారతదేశంలో ఐఆర్‌డిఎ(IRDA) ద్వారా గుర్తింపు పొందిన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)ల కంపెనీలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పరిశీలించండి.
1. Aegon Life Insurance Co.Ltd.
2. Aviva Life Insurance Co.Ltd.
3. Bajaj Allianz Life Insurance Co.Ltd.
4. Bharti AXA Life Insurance Co.Ltd.
5. Birla Sun Life Insurance Co.Ltd.
6. Canara HSBC Oriental Bank of Commerce Life Insurance Co.Ltd.
7. DHFL Pramerica Life Insurance Co.Ltd.
8. Edelweiss Tokio Life Insurance Co.Ltd.
9. Exide Life Insurance Co.Ltd.
10. Future Generali India Life Insurance Co.Ltd.
11. HDFC Standard Life Insurance Co.Ltd.
12. ICIC Prudential Life Insurance Co.Ltd.
13. IDBI Federal Life Insurance Co.Ltd.
14. India First Life Insurance Co.Ltd.
15. Kotak Mahindra Old Mutual Life Insurance Co.Ltd.
16. Life Insurance Corporation of India
17. Max Life Insurance Co.Ltd.
18. PNB MetLife India Insurance Co.Ltd.
19. Reliance Life Insurance Co.Ltd.
20. Sahara India Life Insurance Co.Ltd.
21. SBI Life Insurance Co.Ltd.
22. Shriram Life Insurance Co.Ltd.
23. Star Union Dai-ichi Life Insurance Co.Ltd.
24. Tata AIA Life Insurance Co.Ltd.