IPS VK Singh

IPS VK Singh : నేను పంజాబ్ వెళ్ల‌ను – భ‌గ‌త్‌సింగ్‌లా తెలంగాణ‌లోనే ఉంటాను!

తెలంగాణ‌

బంగారు తెలంగాణ కాదు.. కంగారు తెలంగాణ ఇది!
మంచి పోలీసుల‌కు విలువ లేదిక్క‌డ‌!
త్వ‌ర‌లో కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాను!
వ్యాలెంట‌రీ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వీకే సింగ్ !

IPS VK Singh : Hyderabad : తెలంగాణ ప్ర‌భుత్వం నిత్యం త‌న‌ను వేధిస్తోందని వ్యాలెంట‌రీ రిటైర్డ్ ఐపిఎస్ వీకే సింగ్ (IPS VK Singh)అన్నారు. గురువారం ఆయ‌న బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో మాట్లాడుతూ.. 2020 మే నెల‌లో త‌న‌ రిటైర్మెంట్ పై ప్ర‌భుత్వానికి విఆర్ఎస్ ఇచ్చాన‌న్నారు. జీవ‌నోపాధి కోసం తాను ఉద్యోగంలోకి రాలేద‌ని, సేవాభావం కోసం పోలీస్ అయ్యాన‌ని పేర్కొన‌నారు. ప్ర‌స్తుతం పోలీస్ విభాగంలో వ‌స్తున్న మార్పులు తాను మెద‌క్‌లో మొద‌ట‌గా ప‌నిచేసిన‌ప్పుడే మొద‌లు పెట్టాన‌ని వీకే సింగ్ అన్నారు. పోలీస్ ట్రైనింగ్‌లో స‌మూల మార్పులు కావాల‌ని కోరుకున్నాన‌ని, కానీ ప్ర‌భుత్వం నా వీఆర్ఎస్ క్యాన్సిల్ చేసింద‌ని అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌కు ఛార్జ్‌మెమోరీ ఇచ్చింద‌న్నారు. బంగారు తెలంగాణ‌లో మంచి పోలీస్ అధికారుల‌కు విలువ లేద‌ని పేర్క‌న్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో రెండో స్థానంలో ఉంద‌ని, త‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిత్యం వేధిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం తాను పోరాడ‌తాన‌ని తెలిపారు. మాజీ పోలీస్ అధికారుల‌కు మంచి మంచి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని, కీల‌క శాఖ‌ల‌కు మాత్రం అధికారులు లేర‌ని పేర్కొన్నారు.

కంగారు తెలంగాణ‌గా మారింది : వీకే సింగ్

తెలంగాణ ఆర్టీసీ సంస్థ మునిగిపోతుంద‌ని, సీనియ‌ర్ అధికారులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. చాలా మంది నిజాయితీ అధికారులు మౌనంగా ఉన్నార‌ని, తెలంగాణ‌లో కుటుంబ పాల‌న న‌డుస్తోంద‌ని ఆరోపించారు. బంగారు తెలంగాణ కంగారు తెలంగాణ‌గా మారింద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి తాను అనేక లేఖ‌లు రాశాన‌ని, కానీ అభివృద్ధిపై ఏనాడూ ప్ర‌భుత్వం స్పందించ‌లేద‌ని వీకేసింగ్ తెలిపారు. ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాల‌నేదే ప్ర‌భుత్వం ప్రియారిటీన‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందే ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు ప‌థ‌కాలు తీసుకొస్తుంద‌ని, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని సాధించిన తెలంగాణ‌లో యువ‌త‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. ఇవ‌న్నీ చూశాకా ప్ర‌భుత్వానికి తాను లేఖ రాశాన‌ని అన్నారు. తెలంగాణ విడిచి ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని, ఇక్క‌డే ఉండి ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతాన‌ని అన్నారు.

15 రోజుల్లో భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ : వీకేసింగ్

త‌న‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఎలాంటి ‌విబేధాలూ లేవ‌ని అన్నారు. డ‌బుల్‌బెడ్ రూం స్కీం ఎక్క‌డ పోయింద‌ని, సెక్రెటేరీయ‌ట్ ప‌డ‌గొట్టి కొత్త‌ది క‌ట్ట‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో తుగ్ల‌క్ పాల‌న జ‌రుగుతోంద‌ని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేష‌న్ వైఫ‌ల్యం ఉంద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది.. కొంత ‌మంది నాయ‌కుల కోసం కాద‌ని విమ‌ర్శించారు. పంజాబ్ ప్ర‌భుత్వం త‌న‌ను అడ్వైస‌రీగా నియ‌మించింద‌ని, కానీ త‌న‌కు పంజాబ్ రాష్ట్రం వెళ్ల‌డం ఇష్టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డే ఉంటాన‌ని వీకే సింగ్ అన్నారు.

విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వీకే సింగ్‌

తాను ప్ర‌జ‌ల కోసం ఏదైనా మంచి చేద్ధామ‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళితే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. అధికారులకు ఆత్మ‌సంతృప్తి ఉండాల‌ని కానీ, ఇక్క‌డ అసంతృప్తి ఉంద‌ని అన్నారు. తెలంగాణ లో అధికారుల‌పై కులం, మ‌తం, డ‌బ్బు ప్ర‌భావం, రాజ‌కీయ ఒత్తిడి ఎక్కువుగా ఉంటుంద‌ని తెలిపారు. 15రోజుల్లో తాను భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని పేర్కొన్నారు. ఏ రాజ‌కీయ పార్టీతో త‌న‌కు సంబంధం లేద‌ని, భ‌గ‌త్ సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌లా ప‌ద‌వుల్లేకుండా ప‌నిచేస్తాన‌ని, ప్ర‌తి ఊరూ తిరుగుతాన‌ని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వీకే సింగ్ మీడియా ఎదుట తెలిపారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *