IPS RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో! ప్రభుత్వ గురుకల పాఠశాలల్లో చదివే చిన్న పిల్లాడికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరో తెలుసు. ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆ ఉన్నతాధికారి హఠాత్తుగా తన ఐపిఎస్ పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
IPS RS Praveen Kumar: ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి సోమవారం రాజీనామా చేసినట్టు తెలిపారు. స్వచ్ఛంధ పదవీ విరమణ(వాలంటరీ రిటైర్మెంట్ – వీఆర్ఎస్) కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ కోరడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంమైంది.
వ్యక్తి గత కారణాల మేరకేనా?
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ఎస్. ప్రవీణ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను బహిర్గతం చేశారు. 26 ఏళ్ల పాటు పోలీసు విభాగంలో పనిచేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ లో అధికార పార్టీ తరపున ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!