IPC Sections in telugu: భారతదేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాకపోతే అవి అమలు కాకపోవడంతో హత్యలు, మానభంగాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ప్రతి దేశానికి చట్టాలు, కోర్టులు ఉన్నట్టే మన దేశానికి ఉన్నాయి.
నేరం రుజువు అయితే మాత్రం ఆయా సెక్షన్ల కింద శిక్షలు కఠినంగా అమలవుతుంటాయి.. వారు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత పేదవారైనా శిక్షలు విధించేటప్పుడు ఎలాంటి మార్పులు ఉండవు. ఇక్కడ మనకు ఉపయోగపడే కొన్ని సెక్షన్లు (IPC Sections in telugu) వాటి వల్ల కలిగే శిక్షలు తెలియజేస్తున్నాం.
IPC Sections in telugu: నేరాలు చట్టాలు శిక్షలు
సెక్షన్ 100 – ఆత్మరక్షణకు ఒక వ్యక్తిపైన మహిళ దాడి చేస్తే తప్పులేదు. ఆ సమయంలో ఆ వ్యక్తి మరణించినా తప్పుకాదు.
సెక్షన్ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, Photo, వివరాలు ప్రచురించకూడదు.
సెక్షన్ 354- మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
సెక్షన్ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు అవుతుంది.
సెక్షన్ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
సెక్షన్ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేదివున్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్ధాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
2013 వేధింపుల చట్టం – మహిళలు పనిచేసే ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు, బాస్ ఆఫీసు పనులను అలుసుగా తీసుకొని సెక్స్‌వల్ కాంటాక్టు కోసం ఇబ్బంది పెడితే ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
సెక్షన్ 373 – 18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేతే సెక్షన్ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 376-బి- ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే. ఈ సెక్షన్ కింద అందరికీ శిక్ష పడుతుంది.
ఐపీసీ సెక్షన్ 375 – అత్యాచారం చేస్తే ఈ చట్టం ప్రాకం ఏడేళ్లు Jail శిక్ష నుంచి జీవిత ఖైదు పడుతుంది.
ఐపీసీ సెక్షన్ 354 – అవమానపరిచి దాడి చేస్తే ఈ సెక్షన్ కింద 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
ఐపీసీ సెక్షన్ 496 – పెళ్లైనా కానట్టు మోసగించిన పురుషులకు ఈ section కింద 7 ఏళ్లు జైలు, జరిమానా విధించడం జరుగుతుంది.
IPC Section 302 – ఎవరైనా ఒక స్త్రీని హత్య చేస్తే ఈ సెక్షన్ ద్వారా జీవిత ఖైదు విధించబడుతుంది.
సెక్షన్ 302 బి – వరకట్నం కోసం భార్యను హత్య చేస్తే ఈ సెక్షన్ ప్రకారం ఏడేళ్లు జైలు, జీవిత ఖైదు విధించబడుతుంది.
సెక్షన్ 306 – ఆత్మహత్యకు ప్రేరేపిస్తే ఈ సెక్షన్ కింద పదేళ్లు జైలు, జరిమానా విధిస్తారు.
మహిళలను బంధిస్తే ఏడేళ్లు జైలు, జరిమానా విధిస్తారు.
సెక్షన్ 356 – అత్యాచార ఉద్దేశ్యంతో దౌర్జన్యం చేస్తే ఈ సెక్షన్ కింద జైలు, జరిమానా వుంటుంది.
సెక్షన్ 363 – ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఈ సెక్షన్ కింద జైలు చేయాల్సి ఉంటుంది.
సెక్షన్ 372 – బాలికను వేశ్యా వృత్తికి ప్రేరేపిస్తే ఈ సెక్షన్ కింద పదేళ్లు జైలు జీవితం.
సెక్షన్ 372 – అత్యాచారానికి పాల్పడితే ఈ సెక్షన్ కింద పదేళ్లు జైలు జీవితం.
సెక్షన్ 494 – భార్య ఉండగా ఒక వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ కింద ఏడేళ్లు జైలు, జరిమానా విధిస్తారు.
సెక్షన్ 495 – మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ కింద 10 ఏళ్లు జైలు.
సెక్షన్ 498 ఏ – భర్త, అత్తలు వేధిస్తే ఈ సెక్షన్ కింద మూడేళ్లు జైలు
వరకట్నం నిషేద చట్టం – ఈ చట్టం కింద కట్నం ఇవ్వడమూ తీసుకోవడమూ నేరమే.
సెక్షన్ 509 – స్త్రీలను అవమానపరిస్తే ఈ సెక్షన్ కింద ఏడాది జైలు
సెక్షన్ 493 – పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శృంగారం చేస్తే ఈ సెక్షన్ కింద పదేళ్లు జైలు, జరిమానా విధిస్తారు.