IPC Section 503: ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడనుకోండి. నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టాలని హెచ్చరించాడనుకోండి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నేను సంతకం పెట్టను. నా వృత్తికి ద్రోహం చేయాలేనని చెప్పాడనుకుందాం. అయితే నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన వ్యక్తి గవర్నమెంట్ అధికారిని నువ్వు సంతకం పెట్టకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడనుకోండి. అప్పుడు ఆ గవర్నమెంట్ అధికారి సదరు వ్యక్తిపైన సెక్షన్ 503 కింద పోలీసులకు ఫిర్యాదు(IPC Section 503) చేయవచ్చు.
చేయవల్సిన పనిని చేయనీకుండా బెదిరించినట్టు అయితే, లేదా చేయకూడని పనులు చేయాలని బెదిరించినా..ఆ వ్యక్తిపై బాధితుడు ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు. అంతేకాదు..నువ్వు ఈ పని చేయకపోతే నిన్ను నలుగురులోని నిలబెట్టి పరువు తీస్తానని బెదిరించినా, ఈ సెక్షన్ వర్తిస్తుంది. నువ్వు నాకు ఈ పని చేయకపోతే చనిపోయిన మీ నాన్న, మీ భార్య, మీ భర్త పరువు తీస్తాను అని బెదిరించినా ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయించవచ్చు. అంటే చనిపోయిన వారి గురించి మాట్లాడినా కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది.

ఎవరైనా అమ్మాయికి సంబంధించిన అర్ధనగ్న ఫొటోలను అడ్డం పెట్టుకొని, ఆమెను బెదిరించి చేయకూడని పనులు చేయించుకున్నట్టు అయితే, ఒక వేళ చేయించుకోవాలి అని అనుకున్నట్టు అయితే ఈ సెక్షన్ 503 కింద బెదిరించిన వ్యక్తిపై శిక్ష విధిస్తారు. అదే విధంగా ఎవరైనా మరొకర్ని బెదిరించి పనులు చేయించుకోవాలని చూస్తే పైన తెలిపిన సెక్షన్ కింద శిక్షార్హులు అవుతారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!