ipc section 34 in Telugu: ఐపీసి సెక్ష‌న్ 34 గురించి మీకు తెలుసా?

ipc section 34 in Telugu: భార‌తీయ శిక్షా స్మృతి చాప్ట‌ర్-2 లో ఐసీపీ సెక్ష‌న్ 34 గురించి వ్రాయిబ‌డి ఉంది. ఎవ‌రైనా ఒక‌రు కాకుండా ఇద్ద‌రు, ముగ్గురు, అంత‌కంటే ఎక్కువుగా గ్రూపుగా ఉండి ఒక నేరానికి పాల్ప‌డిన‌ప్పుడు ఈ ఐపీసీ సెక్ష‌న్ 34 కింద వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం కోర్టు వారికి ఉంటుంది. ఈ గ్రూపు హ‌త్య‌లు ఎక్కువుగా ప‌ల్లెటూర్ల‌లో, ఫ్యాక్ష‌నిస్టు ఏరియాల్లో (ipc section 34 in Telugu)జ‌రుగుతుంటాయి.

ఐపీసీ సెక్ష‌న్ 34(ipc section 34)

ఈ ఐపీసీ సెక్ష‌న్ 34 గురించి విపులంగా తెల‌పాలంటే. ఎ- అనే వ్య‌క్తి బి,సి,డి, అనే వ్య‌క్తుల‌ను వెంట పెట్టుకుని మ‌రో వ్య‌క్తిని హ‌త్య చేయాల‌నే ప్లాన్ చేశాడ‌నుకుందాం. వాస్త‌వానికి ఎ అనే వ్య‌క్తి మాత్ర‌మే ఎదుట వ్య‌క్తిపై క‌క్ష ఉంద‌నుకుందాం. మిగిలిన వారు స్నేహ‌తుడు రూపంలోనో, లేక బంధువు రూపంలోనో, ర‌క్తం సంబంధీకుల రూపంలోనో ఎ- అనే వ్య‌క్తి తో పాటు వెళ్లాడ‌నుకుందాం. అక్క‌డ ప్ర‌త్య‌ర్థి వ్య‌క్తిని హ‌త్య చేసే స‌మ‌యంలో ఎ వ్య‌క్తితో పాటు మ‌రో ముగ్గురు(బి,సి,డి) ఉన్నారుకుందాం. అయితే హ‌త్య‌లో మాత్రం ఎ,బి,సి లు అనే వ్య‌క్తులు మాత్ర‌మే పాలు పంచుకున్నారు. డి – అనే వ్య‌క్తి ఈ హ‌త్య చేయ‌లేదు. కాక‌పోతే హ‌త్య జ‌రిగిన సంఘ‌ట‌న ప్ర‌దేశంలో మాత్రం ఉన్నాడు.

file photo

అయితే హ‌త్య చేసిన వ్య‌క్తుల‌ను పోలీసు వారు అరెస్టు చేసిన‌ప్పుడు వారిపై సెక్ష‌న్ 34 కింద కేసు న‌మోదు అవుతుంది. అయితే ఈ అరెస్టులో గ్రూపుగా, గుంపుగా ఉండి హ‌త్య చేశారు కాబ‌ట్టి ఎ- వ్య‌క్తి కి ప‌డే శిక్షే డి- వ్య‌క్తికి, మిగిలిన ముగ్గురు వ్య‌క్తుల‌కూ ప‌డుతుంది. కాబ‌ట్టి సెక్ష‌న్ 34ను గ్రూపుగా ఉండి హ‌త్య చేసిన కేసు విష‌యంలో వినియోగిస్తారు.

పైన తెలిపిన విధంగా సెక్ష‌న్ 34 కింద నేర చ‌ట్టం క‌ఠినంగా అమ‌లు అవుతుంది. ఎవ‌రూ కూడా ఇలాంటి గ్రూపు హ‌త్య‌ల‌లో ఉండ‌రాదు. ఇలాంటి హ‌త్య‌ల‌ను ప్రోత్స‌హించ‌రాదు. చేయ‌ని నేరానికి తెలిసీ తెలియ‌క వెళ్లిన‌ప్ప‌టికీ ఈ సెక్ష‌న్ 34 కింద శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది.

Share link

Leave a Comment