Invitation to Indian Prime Minister Narendra Modi for the G-7 2021 Summit | జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన యూకే ప్రధానిNew Delhi : 2021 కొత్త సంవత్సరంలో జరగబోయే జీ-7 సదస్సకు భారత దేశ ప్రధాని నరేంద్రమోడీకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ సదస్సులో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా కు కూడా ఆహ్వానం పంపింది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్ రిసార్ట్ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ , అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ సదస్సులో భాగంగా ప్రపంచాన్ని గడగడలాండించిన కరోనా వైరస్ మహమ్మారి, పర్యావరణంలో మార్పులు, సాంకేతిపరమైన అభివృద్ధిలో పురోగతి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేఛ్ఛా వాణిజ్యం(డిజిటలైజేషన్) పై జీ -7 లో చర్చించనున్నారు.
ఈ ఏడాది భారత్‌లో జరగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది. అయితే జీ -7 సదస్సు కంటే ముందే భారత్‌లో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అక్కడ స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2020లో జరగాల్సిన జీ-7 సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. 2019లో ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ లో చివరి సమావేశం జరిగంది.ముందుగానే జీ-7 కు భారత్‌కు ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది చదవండి:రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య
ఇది చదవండి: వాళ్లు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. చివరకు..